ఆయన లేకపోతే….

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో బాలీవుడ్‌కు పరిచయమైన అలియా భట్‌ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. మొదట్లో గ్లామర్‌ పాత్రల్లోనే మెరిసిన ఈ భామ తాజాగా తన పంథాను మార్చింది. ‘ఉడ్తా పంజాబ్‌’ చిత్రంలో డీగ్లామర్‌ పాత్రలో సైతం కనిపించి విమర్శకులను మెప్పించింది. తాజాగా షారుక్‌ఖాన్‌ స్వీయ బ్యానర్‌లో ఓ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో షారుక్‌ నటిస్తున్నాడా లేదా అన్న విషయంపై వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టేసింది అలియా. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ స్వీయ బ్యానర్‌లో ‘డియర్‌ జిందగీ’ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా అలియా భట్‌ నటిస్తుంది. ‘డియర్‌ జిందగీలో షారుక్‌ లేకపోతే అసలా సినిమానే లేదు. ఎందుకంటే ఆ చిత్రంలో షారుక్‌ పాత్రే అత్యంత కీలకం. ఆ పాత్ర చుట్టే కథ, చిత్ర నేపథ్యం ఉంటుంది. అలాంటప్పుడు షారుక్‌ లేకుండా సినిమా ఎలా ఉంటుంది. అతను అతిథి పాత్రలో కనిపిస్తాడనేది పుకారు మాత్రమే. అతడే ఈ సినిమాకు కీలకం’. అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అలియా నటించడానికి రెండు ఆసక్తికర అంశాలు ఉన్నాయట. ‘షారుక్‌ సరసన మొదటిసారి నటిస్తున్నాను. అందుకే నాకు ఈ సినిమా ప్రత్యేకమైంది. రెండో విషయం ఏంటంటే.. చిత్ర కథా నేపథ్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ రెండు విషయాలే ‘డియర్‌ జిందగీ’లో నటించేలా చేశాయని’ చెప్పుకొచ్చింది అలియా. గౌరీఖాన్‌, కరణ్‌ జోహార్‌ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోఆనంద్‌ బేడి, కునాల్‌ కపూర్‌, ఆదిత్యా రాయ్‌ కపూర్‌ మరియు అలీ జఫర్‌ తదితర తారాగణం నటిస్తున్నారు. మరి తొలిసారి షారుఖ్‌తో జతకట్టిన అలియా తెరపై ఎలాంటి నటనను ఆవిష్కరించనుందో.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com