ఆషాఢ మాసంలో కొత్తకోడళ్ళకు కష్టాలు ఎందుకు?

వివాహమైన మొదటి సంవత్సరం ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉండరాదన్నది ఆచారంగా వస్తోంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో ఈ ఆచారం మరింత ఎక్కువగా పాటించేవాళ్లు. కొత్తదంపతులు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలన్నది ఇందులోని ఆంతర్యం. గ్రీష్మ, వర్షరుతువుల సంధికాలమైన ఆషాఢంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి.. కాలుష్యాలను కలిగించే సూక్ష్మక్రిముల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వధువు గర్భం ధరిస్తే.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా ఆషాఢంలో గర్భధారణ జరిగితే.. నెలలు నిండే సమయానికి వేసవి తీవ్రత అధికం అవుతుంది. ఈ ప్రభావం తల్లీబిడ్డల ఆరోగ్యంపై పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఆషాఢంలో కొత్తదంపతులు దూరంగా ఉండటమనే ఆచారం వచ్చింది. ఈ సంప్రదాయం వెనుక మరో ఆలోచన కూడా ఉంది. మనది వ్యవసాయం ప్రధానవృత్తిగా ఉన్న దేశం. ఈ మాసంలోనే వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. కొత్తదంపతులు ఒకేచోట ఉంటే కొత్త కోరికల ప్రవాహంలో వ్యవసాయం అశ్రద్ధ అవుతుందనీ, ఫలితంగా ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని.. సామాజిక దృష్టితో ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు మనపెద్దలు. ఏది ఏమైనా ఇది ఆచారమే కానీ, శాస్త్రం కాదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com