ఆస్కార్ మెరుపుకు నాసా మెరుగులు

ఆస్కార్ అవార్డు మురిపిస్తుంది.. మెరిపిస్తుంది.. మైమరిపిస్తుంది. సినిమా రంగంలో ఆస్కార్‌ అవార్డులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ఈ అవార్డు దక్కించుకోవడం తమ జీవితాశయంగా కొందరు భావిస్తుంటారు. ఈ అవార్డును ఒక్కసారైనా ముద్దాడాలని.. ఆ కలను నెరవేర్చుకోవాలని ఎంతో కష్టపడతారు. ఈ రేసులో ఉంటే చాలు.. అవార్డు దక్కకపోయినా పరవాలేదనుకునే వారు మరికొందరు. ఇక అవార్డును అందుకున్నవారు ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మరిచిపోరు. ఇంతలా అందరినీ ఆకర్షించే ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రూపకల్పనలో కూడా అస్కార్‌ నిర్వహకులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆస్కార్‌ ట్రోఫీపై ఉండే బంగారు రంగు వర్ణం ఎప్పుడూ చెదిరిపోదని చెబుతున్నారు. అందుకోసం వారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారం తీసుకోవడం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com