ఆస్ట్రేలియాలో అతిపెద్ద హిందూ దేవాలయం

ఆస్ట్రేలియాలోని అతి పెద్ద హిందూ దేవాలయం నవంబరు 30న ప్రారంభంకానుంది. మెల్‌బోర్న్‌ నగరంలో నిర్మించిన అతిపెద్ద దుర్గామాత దేవాలయం ఆదివారం ప్రారంభించనున్నారు. ఆస్ట్రేలియాలోని హిందూ జనాభా ఎంతోకాలంగా ఈ దేవాలయ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది మెల్‌బోర్న్‌లోని రాక్‌బాంక్‌ టౌన్‌షిప్‌లో ఉంది. దేవాలయ నిర్మాణం పూర్తవడానికి అయిదేళ్లు పట్టింది. ఈ దేవాలయ ప్రారంభోత్సవంతో అక్కడి హిందువులు మత సంబంధ పండగలు జరుపుకోవడానికి చక్కని వేదిక ఏర్పాటైనట్లవుతుంది. దేవాలయంలో దసరా సహా అన్ని పండగలు, భజనలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com