ఆస్ట్రేలియావ్యాప్తంగా ఘనంగా ఉగాది సంబరాలు

ప్రతీ ఏటా ఉగాది సందర్భంగా ఆస్ట్రేలియాలోని అన్ని తెలుగు సంఘాలు ఉగాది కార్యక్రమం తు.చ. తప్పకుండా చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం ఉగాది సంబరాలు గత నెల (మార్చి 18న విలంబి ఉగాది) మొదలై ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారిగా రెండు నిముషాలు తెలుగులో మాట్లాడడం అన్న అంశం అందరినీ ఆకట్టుకుంది. మెల్బోర్న్ తెలుగు సంఘం మొట్టమొదటి సారిగా ఎంతో ఘనంగా “తెలుగు మహాసభలు” నిర్వహించి తెలుగు భాషకు అందలం పట్టారు. అమృతతుల్యమైన అమ్మ భాష కన్నవారు కాదన్నా నన్నాదరించేవారు నావారంటూ నాట్యం చేసింది. ఈ కార్యక్రమానికి సినీ హాస్య నటులు పద్మశ్రీ డా. బ్రహ్మానందం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డా. కళారత్న మీగడ రామలింగేశ్వర స్వామి తన నవావధానంతో ప్రేక్షుకులను మంత్రముగ్దులను చేశారు. సిడ్నీ ఉగాది సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి షుమారు 3000 మంది తెలుగువారు హాజరైనట్లు అంచనా. న్యూ జిలాండ్ తెలుగు సంఘం స్థాపించి రెండు దశాబ్దాలైన సందర్భంగా ఈ సంవత్సరం ఒక మహిళా అధ్యక్షురాలు ఎన్నుకొనబడి ఉగాది సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కాన్బెర్రా ఉగాదికి ఈ సంవత్సరం ప్రత్యేక సంచిక ప్రచురించడం జరుగుతుంది. క్వీన్స్ ల్యాండ్ తెలుగు సంఘం దశమ వార్షికోత్సవం జరుపుకుంటోంది.

tnilive.com australia telugu news telugu news international telugu ugadi australia Melbourne sydney nri ugadi

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com