ఆ తప్పటడుగు నాదే

కొన్నేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడి బయటపడ్డారు నటి మనీశా కోయిరాలా. చాలా కాలం తర్వాత ఆమె ‘డియర్‌ మాయా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘సంజు’ చిత్రంలో అలనాటి తార నర్గిస్‌ దత్‌ పాత్రను పోషించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తన సినిమాల గురించి, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘2010లో నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త సమ్రాట్‌ దహల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ రెండేళ్లకే మేం విడిపోయాం. పెళ్లి విషయంలో తప్పు నాదే. తెలీక వేసిన తప్పటడుగు. బహుశా నా జీవితంలో ప్రేమ, పెళ్లికి చోటు లేదేమో. అయినా పర్వాలేదు..మరో తప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉండటం కంటే నా జీవితంలో ప్రేమకు చోటు లేదు అన్న చేదు నిజాన్ని అంగీకరించడమే మంచిది. నా జీవితాన్ని వెనక్కి నెట్టే అవకాశం మరో వ్యక్తికి ఇవ్వను. దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో నా కెరీర్‌, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకోదలచుకోలేదు. కానీ ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కాదు. నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. నా సమయాన్నంతా బిడ్డకే కేటాయించగలను అని నేను అనుకున్నప్పుడు దత్తత తీసుకుంటాను. వేరే పనులతో బిజీగా ఉన్నప్పుడు బిడ్డకు తల్లవడంలో అర్థంలేదు’ అని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com