ఇంకొక పాట

దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామేనన్‌ జంటగా నటించిన అనువాద చిత్రం ‘100 డేస్‌ ఆఫ్‌ లవ్‌’. ఈ చిత్రంలోని ‘హృదయం కన్నులతో..’ అనే పాటను నిత్యామేనన్‌ పాడారట. విజయ్‌ ప్రకాశ్‌తో కలిసి ఈ పాటను పాడినట్లు నిత్య తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు. అంతేకాదు విజయ్‌ తన అభిమాన గాయకుడని పేర్కొంటూ.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. జీనస్‌ మహ్మద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.వెంకటరత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 26న ‘100 డేస్‌ ఆఫ్‌ లవ్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇదివరకే ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేశారు. అక్కడ మంచి విజయం సాధించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com