ఇంగ్లాండ్ పని పడతారు

ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో అనుభవజ్ఞులు ఉన్నారని, ఈ అనుభవంతో త్వరలో ఇంగ్లిష్‌ గడ్డపై జరగబోయే టెస్టు సిరీస్‌లో ఆటగాళ్లు రాణిస్తారని టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తెలిపారు. తాజాగా చెన్నైలో కుంబ్లే మాట్లాడుతూ… ‘ప్రస్తుత టీమిండియా జట్టు అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. ఎంతో అనుభవం గల బౌలర్లు ఉన్నారు. వీరంతా స్థిరంగా 20 వికెట్లు తీయగలుగుతున్నారు. బ్యాటింగ్‌ విభాగంలోనూ అంతే. అందరూ అనుభవజ్ఞులే’ అని కుంబ్లే అన్నాడు. ‘జట్టులో అందరూ ఆటగాళ్లకు సుమారు 50 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. ప్రపంచంలోనే మేటి స్పిన్నర్లు మన వద్ద ఉన్నారు. అంతేకాదు, ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఇంగ్లాండ్‌ పర్యటన కాదు. గతంలోనూ అక్కడ ఆడారు. దీంతో వారు ఇంగ్లాండ్‌ పరిస్థితులకు చాలా త్వరగా అలవాటు పడగలరు. ఇది మనకు కలిసొచ్చే అంశం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఈసారి ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ గెలిచే అవకాశాలు భారత్‌కు మెండుగా ఉన్నాయి’ అని కుంబ్లే తెలిపాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com