ఇండిగోపై సెటైర్లు వేసిన ఎయిర్ ఇండియాకు ఝలక్ ఇచ్చిన పైలట్

ఎయిరిండియా పైలట్ ఒకరు తన డ్యూటీ టైమ్ అయిపోయిందంటూ రన్‌వేపై అర్థాంతరంగా విమానం వదిలేసి వెళ్లిపోయిన వైనమిది. దీంతో బుధవారం రాత్రి జైపూర్‌లో దిగిన విమానం.. గురువారం సాయంత్రం వరకు అక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురిచేసిన ఈ ఘటనపై వివరాల్లోకి వెళితే… ఎయిరిండియాకి చెందిన 9ఐ 644 విమానం లక్నో నుంచి జైపూర్ మీదుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. రాత్రి 9 గంటలకల్లా జైపూర్ విమానాశ్రయానికి రావాల్సి ఉండగా… అక్కడికి చేరుకునే సరికి రాత్రి 1:30 అయింది. రాజధాని ఢిల్లీ ప్రాంతంలో దట్టమైన పొగమంచు, అక్కడి ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్యల వల్ల మరో అరగంట వరకు విమానం కదల్లేదు. చివరికి ఏదో విధంగా రాత్రి 2 గంటలకు టేకాఫ్ పాయింట్‌కి వచ్చిన విమానం.. మళ్లీ అరగంటకు పైగా నిలిచిపోయింది. ఏంటా అని ఆరాతీసిన ప్రయాణికులు అసలు విషయం తెలిసి బిత్తరపోయారు. ఈ సారి ఏకంగా పైలట్ తన డ్యూటీ టైమ్ అయిపోయిందంటూ విమానం వదిలేసి వెళ్లిపోయాడు. చివరికి అందులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రయాణికులను గురువారం ఉదయం ఓ బస్సులో ఢిల్లీకి పంపించారు. మరికొంత మందికి స్థానిక హోటల్లో బస ఏర్పాటు చేసి తర్వాతి విమానాల్లో పంపించారు. ఈ వ్యవహారాన్ని జైపూర్ విమానాశ్రయ సిబ్బంది ధ్రువీకరించినప్పటికీ.. ఎయిరిండియా మాత్రం నోరు విప్పకపోవడం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com