ఇందిరకు పెళ్లి శుభలేఖ నచ్చింది. అదే కరెన్సీ రంగుగా మారింది.

దేశంలో పెద్దనోట్లు రద్దుచేసిన తరువాత అనేక ఊహాగానాలు చెలరేగాయి. కొత్త నోట్ల రంగు, రూపురేఖలపై పలు చర్చలు సాగాయి. అయితే ఎటువంటి మార్పులకు నోచుకోని రూ. 20 నోటు పింక్ కలర్‌లో ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? దీనివెనుక ఒక ఆసక్తికర కథనం ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రూ. 20 నోటును జారీచేసే విషయమై సమావేశం జరిగింది. అప్పడు ఈ నోటు ఏ రంగులో ఉండాలనే దానిపై చర్చించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పీడీ కాస్బేకర్ కూడా హాజరయ్యారు. సమావేశంలో ఎంతసేపటికీ రూ. 20 నోటు రంగు గురించి నిర్ణయానికి రాలేకపోయారు. ఉన్నట్టుండి ఇందిరాగాంధీ దృష్టి కాస్బేకర్ జేబులోని పింక్ కవర్‌పై పడింది. దీంతో ఆమె ఆ కవర్‌ను బయటకు తీయాలని కోరారు. ఆ రంగు తనకు ఇష్టమని, రూ. 20 నోటు అదే రంగులో ఉండాలని అన్నారు. కాగా కాస్బేకర్ జేబులో ఉన్నది ఒక పెళ్లి ఆహ్వాన పత్రిక. 1972 జూన్ 1న గులాబీరంగుతో కూడిన రూ. 20 నోటు మార్కెట్‌లోకి వచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com