ఇకపై ఎన్నికల్లో జోక్యం చేసుకోము

ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ మంగళవారం కూడా అమెరికా కాంగ్రెస్‌ ముందు హాజరయ్యారు. ఫేస్‌బుక్‌లో జరిగిన డేటా దుర్వినియోగానికి తానే బాధ్యత వహిస్తూ మరోసారి సెనేట్‌లో క్షమాపణలు కోరారు. సెనేట్‌కు చెందిన జ్యుడీషియరీ, కామర్స్‌ కమిటీల ఎదుట ఆయన మాట్లాడారు. తప్పు తనదేనని పునరుద్ఘాటించారు. ఫేస్‌బుక్‌ నేనే ప్రారంభించాను, నేనే నిర్వహిస్తున్నా, ఇక్కడ ఏం జరిగినా నాదే బాధ్యత అని చెప్పారు. భారత్‌ సహా పలు దేశాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో డేటా లీకేజీ జరగకుండా ఉండేందుకు తమ కంపెనీ అన్ని విధాలా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2018 సంవత్సరం ప్రపంచమంతటికీ చాలా కీలకమైన సంవత్సరం. భారత్‌, పాకిస్థాన్, బ్రెజిల్‌ సహా పలు దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో సమాచారం సురక్షితంగా ఉండేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఎవ్వరి జోక్యం ఉండకుండా చేయడమే తమ ముందున్న ముఖ్యమైన అంశమని’ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. నవంబరులో అమెరికాలో జరిగే కాంగ్రెషనల్‌ మధ్యంతర ఎన్నికలకు కూడా పూర్తి రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. భారత్‌ చాలా పెద్ద దేశమని, అక్కడి ఎన్నికల ప్రాధాన్యత తనకు తెలుసని అన్నారు. భారత్‌పై తన వద్ద ఓ డాక్యుమెంటేషన్‌ కూడా ఉందని, ఆసక్తి ఉంటే చూపిస్తానని జుకర్‌బర్గ్‌ శాసనకర్తలకు వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com