ఇక కళ్ళజోడు షాపులు ఉండవు

చత్వారపు కళ్ళ జోడుకు (బైఫోకల్స్ కు ) త్వరలో కాలం చెల్లినట్టు అనిపిస్తోంది. దూరంలోనైనా, దగ్గరున్నా,, ఏ వస్తువు వైపు చూస్తున్నారో సరిగా దానిపైనే ‘ఫోకస్’ పెట్టే అదునాతన కళ్ళద్దాలు తెరపైకి వచ్చాయి. ‘స్మార్ట్ గ్లాసెస్ ‘ గా పిలుస్తున్న వీటిని అమెరికాలోని యూటా వర్సిటీ నిపుణులు అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనలో భారత సంతతి శాస్త్రవేత్త ఐశ్వర్య దేవ్ బెనర్జీ పాలుపంచుకోవడం విశేషం. ఈ అధునాతన కళ్ళద్దాలలో గ్లిజరిన్ తో తయారుచేసిన కటకాలు (లెన్స్ లు) ఏర్పాటుచేశారు. ఈ లెన్స్ లోని పొరలను మూడు యాక్చువేటర్లతో అనుసంధానించారు. ఇవి పొరలను వెనక్కు, ముందుకు నెడుతూ లెన్స్ ఫోకస్ ను మార్చే వీలుంది. మనం ఓ వస్తువు వైపు చూస్తున్నప్పుడు వస్తువుకు, కంటికి మధ్య దూరాన్ని అతినిల లోహిత కిరణాల ద్వారా యాక్చువేటర్లు కొలుస్తాయి. ఈ దూరానికి అనుగుణంగా లెన్స్ ల్లో మార్పులు చేస్తాయి. బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్ అద్దాలు 14 మిల్లి సెకన్ల లోనే ఫోకస్ ను మార్చుకోగలవని పరిశోధకులు చెబుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com