ఇన్నాళ్లకు రైతు సమస్యలపై ఓ లేఖ రాసిన చంద్రబాబు

అన్నదాతలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్లో పేర్కొన్న ‘జనాకర్షక పథకాలపై సమీక్ష’ అనే అంశం అభ్యంతరకరమని ఆయన లేఖలో పేర్కొన్నారు. విద్యుత్‌ చట్టం- 2003కు సవరణ ప్రతిపాదించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కూడా రాష్ట్రాలు ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా కేంద్రం ఒత్తిడి చేసేలా ఉందని అభిప్రాయపడ్డారు. విద్యుత్‌ చట్టానికి సవరణలు చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని ముఖ్యమంత్రి లేఖలో కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధానం రైతుకు మేలు చేసేలా ఉండాలని పేర్కొన్నారు. ఏపీలో వరి సాగు ఖర్చు హెక్టారుకు 1.08లక్షలు అవుతోందని, క్వింటాలుకు 1702 రూపాయలు సాగు ఖర్చు అవుతుందని వివరించారు. సాగు ఖర్చు రూపాయి అయితే మద్దతు ధర 83 పైసలుగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. వరితో పాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని సూచించారు. పంటల బీమా నిబంధనల్లో పలు మార్పులు అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులు తమ దగ్గర తీసుకున్న రుణాల వివరాలను జాతీయ పంట బీమా పోర్టల్‌లో నమోదు చేయాలని బ్యాంకులకు విధించిన నిబంధనతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు..

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com