ఇయర్‌ఫోన్లు లాక్కుని…కులం పేరిట దూషించిన వర్ల రామయ్య


ఆర్టీసి ఛైర్మన్ వర్ల రామయ్య ఓ ప్రయాణికుడిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండులో తనిఖీల సందర్భంగా ప్రయాణికుడిని కులం పేరుతో దూషించారు. ఆర్టీసి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బస్టాండులో తిరుగుతున్నప్పుడు ఓ యువకుడు బస్సులో కూర్చుని చరవాణిలో పాటలు వింటూ కనిపించాడు. తాము వస్తున్నా పట్టించుకోకుండా పాటలు వింటుండటం వర్లకు ఆగ్రహం తెప్పించింది. సదరు ప్రయాణికుడి నుంచి ఇయర్ ఫోన్ తీసుకుని ఏం వింటున్నాడో పరిశీలించాడు. ఆ తర్వాత ఆ యువకుడి తల్లిదండ్రులు, ఆస్తిపాస్తులు, విద్యార్హతలు అడిగారు. అంతటితో ఆగకుండా ఏ కులమని అడిగి… ఆ యువకుడి నుంచి సమాధానం వచ్చిన వెంటనే… ఆ కులాన్ని పేర్కొంటూ దూషించారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పరిశీలించేది లేదా అంటూ నిలదీశాడు. దీంతో ఆ యువకునితో పాటు చుట్టు పక్కల ప్రయాణికులు సైతం విస్తుపోయారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com