ఇరువురి భామల మధ్య సరికొత్త పోరు

జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ వేడెక్కింది.. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రణయ్‌తో శ్రీకాంత్‌.. మహిళల ఫైనల్లో సైనా నెహ్వాల్‌తో పి.వి.సింధు తలపడనున్నారు. మంగళవారం పురుషుల సెమీస్‌లో టాప్‌సీడ్‌ శ్రీకాంత్‌ 21-16, 21-18తో యువ ఆటగాడు లక్ష్యసేన్‌ను ఓడించగా.. మరో సెమీస్‌లో రెండో సీడ్‌ ప్రణయ్‌ 21-14, 21-17తో శుభంకర్‌ డేపై గెలిచాడు. మహిళల సెమీస్‌లో టాప్‌సీడ్‌ సింధు 17-21, 21-15, 21-11తో మరో తెలుగమ్మాయి గద్దె రుత్విక శివానిపై కష్టపడి గెలిచింది. తొలి గేమ్‌ను 21-17తో గెలిచి మంచి వూపు మీద కనిపించిన రుత్విక.. రెండో గేమ్‌లోనూ సింధుకు గట్టిపోటీనే ఇచ్చింది. అయితే బ్రేక్‌ తర్వాత పుంజుకున్న సింధు.. వరుస పాయింట్లతో 21-15తో గేమ్‌ గెలుచుకుని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణయాత్మక ఆఖరి గేమ్‌లో విజృంభించి ఆడిన సింధు 21-11తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. మరో సెమీస్‌లో రెండో సీడ్‌ సైనా 21-11, 21-10తో అనుర ప్రభుదేశాయ్‌ను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప, ప్రణవ్‌ చోప్రా-సిక్కిరెడ్డి జోడీలు ఫైనల్‌ చేరాయి. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, సన్యోగిత-ప్రజక్త సావంత్‌ తుది సమరంలో అడుగుపెట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com