ఇస్రో ప్రయోగాలపై పాక్ విసుర్లు

పాకిస్థాన్‌ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో నిర్వహించిన వందో ప్రయోగంపై అక్కసును వెళ్లగక్కింది. ఇలాంటి ప్రయోగాలతో దేశాల మధ్య ప్రాంతీయ వ్యూహాత్మక స్థిరత్వం దెబ్బతింటుందంటూ వ్యాక్యానించింది. ఈ ప్రయోగం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. పాక్‌ విదేశాంగ వ్యవహారాలశాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్‌ మహ్మద్‌ ఫైజల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మాకు అందిన సమాచారం ప్రకారం భూభాగాన్ని పర్యవేక్షించే కార్టోశాట్‌ ఉప్రగ్రహంతోపాటు మొత్తం 31 ఉపగ్రహాలు జనవరి 12న(శుక్రవారం) ప్రయోగిస్తుందని తెలిసింది. అన్ని ఉపగ్రహాలు కూడా రెండు రకాల సేవలు అందిచేవని అర్థమవుతోంది. పౌరసమాజానికి సేవలందించడంతోపాటు సైనికులకు కూడా అవి సహాయపడేలా వాటిని భారత్‌ రూపొందించింది. ఇలా చేస్తే వ్యూహాత్మక భాగస్వామ్యం తన నిలకడను కోల్పోతుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత వాతవరణం దెబ్బతినకుండా ప్రయోగాలు చేసుకునేందుకు అన్ని దేశాలకు అవకాశం ఉంది. కానీ ఒక దేశ మిలిటరి నిలకడను దెబ్బతీసేట్లుగా చర్యలు ఉండరాదు’ అని అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com