ఈబీ2 ఇక జీవితంలో రాదు

అమెరికాలో ఉద్యోగ నిమిత్తం వెళ్లిన భారతీయులకు గ్రీన్‌ కార్డ్‌ ఓ కల. ఇది వస్తే అమెరికా పౌరసత్వ హోదాను దర్జాగా అనుభవించవచ్చు. అమెరికన్లకు ఏవైతే ప్రయోజనాలుంటాయో కొంచెం అటుఇటుగా ప్రవాస భారతీయులకూ అవే లాభాలు చేకూరుతాయి. కాబట్టే గ్రీన్‌కార్డంటే అంత మక్కువ. మరి ఈ గ్రీన్‌ కార్డ్‌ అంత సులభం కాదు. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీతో గ్రీన్‌ కార్డు పొందాలంటే మాత్రం కచ్చితంగా 150 సంవత్సరాలు వేచి చూడాల్సిందేనని నివేదికలు చెబుతున్నాయి.

గ్రీన్‌కార్డ్‌ కోసం వేచి ఉన్న వారి జాబితాను లెక్కించి వాషింగ్టన్‌కు చెందిన కాటో ఇన్‌స్టిట్యూట్‌ ఈ విషయాన్ని తెలిపింది. యూఎస్‌ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) గ్రీన్‌ కార్డ్‌ కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 2017లో అమెరికా జారీ చేసిన గ్రీన్‌ కార్డులను ఆధారం చేసుకుని కాటో ఈ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించింది.

కాటో నివేదిక ప్రకారం 2018ఏప్రిల్‌ 20నాటికి లక్షలమంది ప్రవాస భారతీయులు, వారి భార్యా పిల్లలు గ్రీన్‌ కార్ట్‌ కోసం వేచి ఉన్నారు.

* ఉద్యోగ నిమిత్తం వెళ్లే వారికి జారీ చేసే ఈబీ-1(అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు) కేటగిరికి చెందిన వాళ్లకు మాత్రం గ్రీన్‌ కార్డు కేవలం ఆరు సంవత్సరాల్లోనే వచ్చే అవకాశముంది. ఇది కూడా వారి నైపుణ్యాలను బట్టి ఉంటుంది.

* యూఎస్‌సీఐఎస్‌ వివరాల ప్రకారం ఈబీ-1 కేటగిరికి చెందిన 34,824మంది భారతీయులు తమ భాగస్వాములు, పిల్లలకు కలిపి గ్రీన్‌కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నారు.

* బ్యాచిలర్స్‌ డిగ్రీ అర్హతతో వెళ్లిన ఈబీ-3కేటగిరికి చెందిన వాళ్లకు మాత్రం గ్రీన్‌ కార్డ్‌ రావాలంటే దాదాపు 17ఏళ్లు పట్టవచ్చు. ఏప్రిల్‌ 20 నాటికి ఈ కేటగిరి కింద గ్రీన్‌ కార్డు పొందడానికి 54,892మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకూ ఈ కేటగిరి కింద అమెరికా పౌరసత్వం పొందాలని దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1,15,273కు చేరింది.

* గ్రీన్‌ కార్డు కోసం ఈబీ-2 కేటగిరి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అమెరికా నిబంధనల ప్రకారం వీరికి గ్రీన్‌ కార్డ్‌ రావడానికి కనీసం 150 సంవత్సరాలు పట్టే అవకాశముంది. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ అర్హతతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కూడా దీనికి ఒక కారణం. యూఎస్‌సీఐఎస్‌ గణన ప్రకారం ఈ కేటగిరి కింద గ్రీన్‌ కార్డ్‌ పొందాలనుకునే వాళ్ల సంఖ్య 2,16,681. వారి భార్యపిల్లలతో కలిపి 4.33,368 మంది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

* అన్ని కేటగిరీల్లోనూ కలుపుకొని లక్షలాది దరఖాస్తుదారులు గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

2017లో కేవలం 22,602 భారతీయులకు మాత్రమే గ్రీన్‌ కార్డ్‌ అందింది. ఇందులో ఈబీ-1 కేటగిరికి చెందిన 13,082 మందికి, 2,879 మంది ఈబీ-2కేటగిరికి చెందిన వారికి, ఈబీ-3 కేటగిరికి చెందిన 6,641మందికి అందాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com