ఈవారం సవాలే

డాలర్‌ బలపడటం, చమరు ధరల పెంపు భయాలు, తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు వెరసి ఈవారం రూపాయి గడ్డు పరీక్షను ఎదుర్కోనుంది. ఇప్పటికే జూన్‌ 28వ తేదీన డాలర్‌తో పోల్చుకుంటే అత్యల్పస్థాయి (రూ69.10)కి పతనమైన ఆ తర్వాత కొంచెం కోలుకుంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ వారం రూ. 70 మార్కును తాకవచ్చని భయాలు నెలకొన్నాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావం ఆసియా దేశాల కరెన్సీల ఒత్తిడికి గురిచేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు భారత్‌లో ఎఫ్‌పీఐలు తగ్గుముఖం పడుతున్నాయి. 29జూన్‌ నాటికి భారత విదేశీ మారకద్రవ్య రిజర్వులు 406.058 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి. అమెరికాకు చెందిన మెర్రిల్‌ లించ్‌ నివేదక ప్రకారం ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపు కూడా రూపాయిని బలహీనపడింది. జూన్‌6 నుంచి రూపాయ విలువ 1.9శాతం తగ్గింది.

* ముఖ్యంగా క్రూడ్‌ అయిల్‌ కంపెనీలకు చెల్లింపుల కోసం డాలర్లకు డిమాండ్‌ పెరగటంతో కరెంటు ఖాతా లోటు పై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.
* దిగుమతిదారులకు కూడా చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు.
* విదేశీ అప్పులు తీసుకొచ్చిన కంపెనీలకు చెల్లింపులు భారంగా మారవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com