ఈవీఎంల గురించి జాగ్రత్తగా ఉండండి

ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియోగానికి అవకాశాలు ఉన్నాయని, దానిపట్ల పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం అమరావతిలోని ప్రజాదర్బార్‌ హాలులో నిర్వహించిన తెదేపా సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈవీఎంల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పార్టీ క్యాడర్‌ను సైతం అప్రమత్తం చేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సీఎంను కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ఏ ఎలక్ట్రానిక్ వస్తువునైనా దుర్వినియోగం చేయటం సులభతరమన్నారు. ఈవీఎంల దుర్వినియోగానికి అవకాశాలు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాన్ని సీరియస్‌గా ఆలోచించాలని నేతలకు సూచించారు. ఈ భేటీలో బూత్‌ కమిటీల నిర్వహణపై మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడారు. 55 శాతం బూత్‌ కమిటీలు ఇప్పటికే ఖరారయ్యాయని, మిగిలిన చోట్లా జిల్లా యంత్రాంగంవేగంగా ఖరారు చేయాలన్నారు. బూత్‌లవారీగా ఓటరు లిస్ట్‌పైనా జిల్లా నేతలు పూర్తి పట్టు సాధించాలని లోకేశ్‌ సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com