ఈశ్వరి దొరికింది

విశాఖ జిల్లా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి పర్యటన అధికారులు, పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. మధ్యాహ్నం పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే ఆచూకీ రాత్రయినా తెలియక పోవడంతో ఏం జరిగిందోనని నానా హైరానా పడ్డారు. గిడ్డి ఈశ్వరి గురువారం దళితతేజంలో పాల్గొనడానికి గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్‌కు వచ్చారు. అక్కడ కార్యక్రమం ముగిశాక మండలకేంద్రం నుంచి సప్పర్ల, ధారకొండ, దుప్పిలవాడ పంచాయతీల్లో పర్యటించడానికి బయల్దేరారు. పోలీసులు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో వద్దన్నారు. అయితే ఆమె వినలేదు. గాలికొండకు బయల్దేరారు. చీకటి పడినా ఎమ్మెల్యే నుంచి సమాచారం రాలేదు. చివరికి రాత్రి పదిగంటలకు ధారకొండకు ఎమ్మెల్యే చేరుకున్నారన్న సమాచారంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో 8 గంటలపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com