ఈ ఏడాది ఆల్ బుక్కారా తిన్నారా?

గంగరేగు పండుకన్నా కాస్త పెద్దగా.. యాపిల్‌లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. చాలా మంది వీటిని అంతగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో కేలరీల సంఖ్య చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఆల్‌బుకారా పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ఆల్‌బుకారా పండ్లలో ఈ ఫెనోలిక్ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రూన్స్, డ్రూప్స్, ప్లమ్… ఎలా పిలుచుకున్నా అభ్యంతరం చెప్పని ఈ పళ్లు బ్లూ- బ్లాక్, పసుపు, పర్పుల్, ఎరుపు రంగులలో దొరుకుతాయి.
* విటమిన్ ‘సి’ కి ఈ పండు చిరునామాగా చెప్పుకోవచ్చు. ఇది మంచి యాంటీ ఆక్సిడెంటని వేరుగా చెప్పనవసరం లేదు
* రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో తోడ్పడుతుంది.
* విటమిన్ ఎ, బీ టాకెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి.
* జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువ.
* జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఇందులో చాలా వుంది.
* ఇందులో ఉన్న పొటాషియం గుండె జబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
* శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది.
* ఇందులోని విటమిన్ ‘కె’ ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది.
* కంటిచూపును మెరుగుపరుస్తుంది. జ్వరానికి, మలబద్ధకానికి మంచి విరుగుడుగా ఆల్‌బుకారా పండ్లు ఎంతగానో ఉపయోగపగడుతుంటాయి. ఎండు ఆల్‌బుకారాలను రోజుకు 10 చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలుండవు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com