ఈ-మెయిళ్లు ఇక హిందీలో పంపుకోవచ్చు

హిందీలో ఈ మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునే అవకాశం ఇక మీ ముందుకొస్తోంది. డేటా ఎక్స్ జెన్ టెక్నాలజీస్ ఈ కొత్త అవకాశాన్ని కల్పింస్తోంది. హిందీ అక్షరాలు, దేవనాగరి లిపితో కొత్తగా పెయిడ్ ఈ మెయిల్ అడ్రస్ సర్వీస్ ను ప్రారంభించింది. జీ మెయిల్, అవుట్ లుక్, యాహూ తరహాలో త్వరలో ఉచిత ఐడీ రిజిస్ట్రేషన్ కోసం కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకూ భారత్ డొమైన్ లో దేవనాగరి లిపిలో కొన్ని వందల ఐడీలు రూపొందించిన సంస్థ… హిందీలో ఈ మెయిల్ క్రియేట్ చేసుకునే ఆసక్తి ఉన్నవారు తమ వెబ్ సైట్ ను సందర్శించి, వారి అవసరం మేరకు ఈ మెయిల్ ప్యాకేజీని కొనుగోలు చేయొచ్చని డేటా ఎక్స్ జెన్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అజయ్ డేటా తెలిపారు.కొత్త హిందీ ఈ మెయిల్ అడ్రస్ కు జీ మెయిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ల మద్దతు ఉంటుందని, వాటినుంచీ వచ్చిన ఈమెయిల్స్ ను అందుకోవడంతోపాటు, హిందీ లిపిలో ఆయా ప్రొవైడర్లకు మెయిల్స్ పంపించినా రిసీవ్ చేసుకుంటాయని సంస్థ వెల్లడించింది. జీ మెయిల్ ఆఫ్ ఇండియాలాగా త్వరలో భారత్ డొమైన్ లో తాము ఉచిత ఈ మెయిల్ ఐడీ సర్వీసును అందించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని డేటా తెలిపారు. అధికశాతంమంది ఇంటర్నెట్ ను వినియోగించేందుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే హిందీ అక్షరాలు, దేవనాగరి లిపిలో వెబ్ సైట్లు, ఈ మెయిల్ అడ్రస్ ల ను ఉచితంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మత్రిత్వశాఖ ఇటీవల ఓ సమావేశం నిర్వహించి ప్రముఖ సంస్థల ఈమెయిల్ సర్వీసులను కూడా కోరింది. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ లు అందుకు అంగీకరించాయి. హిందీలో ఈ మెయిల్ సందేశాలు పంపించవచ్చని, అయితే ఇప్పట్లో హిందీ అక్షరాలు, దేవనాగరి లిపిలో ఈ మెయిల్ అడ్రస్ లు అందించేందుకు తాము ఎటువంటి ప్రణాళిక చేయలేదని ఆయా సంస్థలు స్సష్టం చేశాయి.ప్రపంచంలోని ఇతరులతో మమేకం అయ్యేందుకు ఈ మెయిల్ ఓ రియాలిటీగా మారిందని, ఈ నేపథ్యంలో భాష అడ్డంకి కాకూడదని గూగుల్ ఓ బ్లాగ్ పోస్ట్ లో అభిప్రాయపడింది. ఇందులో భాగంగా తమ జీ మెయిల్ సర్వీస్ కోసం చైనీస్, జార్జియన్, ఖ్మైర్, లావో, మంగోలియన్, నేపాలీ, సింహళ, జులు వంటి సుమారు 13 భాషలను జోడించినట్లు బ్లాగ్ లో పేర్కొంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్నివినియోగించి, యూజర్లకు సులభంగా ఉండేందుకు స్థానిక భాషల్లో డొమైన్ పేర్లను అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com