ఈ రోజు వార్తల్లోని వాడీవేడి అంశాలు

• బిజెపి అధ్యక్షుడు అమిత్ షా శనివారం నాడు ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. యుపిలో అధికారంలోకి వస్తే ఉచితంగా యువకులకు లాప్ టాప్ లు అందజేస్తామని ప్రకటించారు.
• గోవాలో జరుగుతున్న ఎన్నికల్లో “ఆప్” పార్టి ముందుకు దూసుకువేళుతుంది. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది.
• ఆదివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరి పార్టి సమావేశం జరుగుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చిస్తారు.
• జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది పెత్తనమంటూ అనవసర వ్యాఖ్యలు వద్దని, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. జల్లికట్టును కాంగ్రెస్ నిషేధించిందని, జల్లికట్టుకు అనుకూలంగా బిజెపి ఆర్డినెన్స్ తెచ్చిందని ఆయన మరోసారి గుర్తుచేశారు
• బిజెపితో మహారాష్ట్ర లో తెగతెంపులు చేసుకున్న శివసేన రాజ్ ధాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎం ఎన్ఎస్ ) తో పోత్తుపెట్టుకుంది.
• గుజరాత్ లోని బనస్కాంత అనే ప్రాంతంలో ఒక మహిళ సన్యాసి నుండి 5 కోట్ల విలువైన బంగారు బిస్కెట్ లు, రూ. 1.2 కోట్ల నగదు, విదేశీ మద్యం సీసాలను సోమవారం నాడు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
• అమెరికా లోని డెల్టా ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని రావియా ఖాన్ ను అదే సంస్తలో పనిచేస్తున్న రాబిన్ రోడ్స్ అనే వ్యక్తీ దౌర్జన్యం జరిపి గాయపరచడం అమెరికా అంతటా సంచలనం కలిగించింది. ముస్లిం ఉద్యోగులకు అమెరికాలో భద్రత లేకుండా పోయిఒదని అక్కడి ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి.
• ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలిపై డాడి జరిగింది. జైపూర్ లో పద్మావతి షూటింగ్ జరుపుతుండగా రాజ్ పుట్ కార్నిసేన కార్యకర్తలు డాడికి పాల్పడ్డారు. ఆయన్ను చెంప దెబ్బలు కొట్టడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. ఘటన జైగడ్ కోట వద్ద జరిగింది. దాడితో సినిమా టీం మొత్తం షాక్ కు గురైంది.
• కాశ్మీర్ లో మంచు కొండ చరియలు విరిగిపడిన సంఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది.
• తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నాడు 30 ఏళ్ల రష్యాకు చెందిన పర్యాటకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విమానాశ్రయం భవనం పైకి ఎక్కి కిందకు దూకి మరణించాడు. డాని ఇమిగ్రేషన్ సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అంటున్నారు.
• తమిళనాడులో జల్లికట్టు పోరాటం ఆంధ్రప్రదేశ్ నే కాకుండా పొరుగునే ఉన్నా కర్ణాటక ను తాకింది. కర్ణాటక లో ఉన్న కంబల ప్రాచిన క్రీడను పునరుద్ధరించాలని అక్కడి యువతరం ఆందోళనకు సిద్దమవుతుంది.
• కొత్తగూడెం జిల్లాలో ఇరువురు విద్యార్థుల మధ్య ఏర్పడిన వివాదం ఒక విద్యార్థి ప్రాణాలను బలిగొంది. చంద్రుగుండ పాటశాలలో నల్ల బల్ల తుడిసే డస్టర్ విషయంలో ఇరువురు విద్యార్థుల మధ్య వివాదం ఏర్పడింది. అనంతరం జరిగిన కొట్లాటలో భాను ప్రకాష్ అనే విద్యార్ది అక్కడికక్కడే మృతి చెందాడు.
• కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చోదరి శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడారు. టి.ఆర్.ఎస్. మట్టి కలిపించాలంటే గ్రామీణ స్థాయి నుండి కేడర్ ని బలోపేతం చేయాలని సీనియర్లు ముఖ్యమంత్రి పదవి ఆశించకుండా మంచి కార్యకర్తలను తయారు చేయాలని కోరారు.
• పంజాబ్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరిందర్ సింగ్ ఎన్నికౌతారని రాహుల్ గాంధీ ప్రకటించారు.
• వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో సమావేశం అయ్యారు. తన చిన్నాన్న మనోహర్ రెడ్డి తో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకునే చర్యలు చేపట్టినట్లు సమాచారం.
• కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కు ఈ మద్య ఆంధ్రప్రదేశ్ పై అపరిమితమైన అభిమానం ఏర్పడింది. “ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంటే…భారతదేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందని వెంకయ్య విశాఖలో వెల్లడించారు.
• ప్రధాని మోడీ పేరుతొ నకిలీ వెబ్ సైట్ ను సృష్టించిన ఇరువురు మోసగాళ్ళను పోలీసులు అరెస్టు చేశారు.
• బెంగళూర్ యూనివర్సిటిలో ఒక పని మనిషి కుమార్తె పి.జి. పరీక్షల్లో మొదటి స్థానం చేరుకొని 8 బంగారు పతకాలు కైవసం చేసుకుంది.
• గన్నవరం విమానాశ్రయం వద్ద శుక్రవారం మద్యాహ్నం కాశ్మీర్ నుండి వచ్చిన 5 గురు అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
• జాతీయ స్థాయి స్విమ్మర్ తనిక ధార శుక్రవారం నాడు ముంబాయిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
• మారుతి సుజుకి తన అన్నీ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com