ఈ రోజు వార్తల్లోని వాడీవేడి అంశాలు

* గత అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని రభస సృష్టించి విధ్వంసానికి పాల్పడినందుకు వైకాపాకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలపై చర్యకు సిఫార్సు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో దాడిశెట్టి రాజా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, చెవి రెడ్డి భాస్కర రెడ్డి, ముత్యాల నాయుడు కె. శ్రీనివాసులు, ఉన్నారు. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అద్యక్షతన ఈ కమిటీ సమావేశం సనివారం ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో జరిగింది.
*ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీలు చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు కోతలు దాటుతున్నాయి. పంజాబ్ ఎన్నికల్లో వాగ్దానాలు చూస్తె నోరెళ్ళ బెట్టాల్సిందే. తిరిగి తమకు అధికారంతో కట్ట వెడితే చాలు. చాంతాడంత మేలు చేస్తామంటూ ఇప్పటికే వివిధ ఎన్నికల ప్రచారాల్లో చెబుతున్న శిరోమణి అకాలీ దళ్ తాజాగా తన మేనిఫెస్టోలో పెద్ద శుభవార్తను తెలియజేసింది. అమెరికాలో, కెనడాలో దాదాపు ఒక లక్ష ఎకరాల కొనుగోలు చేస్తామని అక్కడకు వెళ్లి సెటిల్ అయ్యే పంజాబీలకు ఆ భూమి ఉపయోగిస్తామని తెలిపారు.
*ట్రంప్ నిర్ణయంతో తన గుండె పగిలిందని పాకిస్తానీ విద్యార్ది కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహిత యుసూఫ్ జాయ్ మలాలా పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత నిస్సహాయుల పై తీసుకున్న కటిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రంప్ కు విజ్ఞప్తి చేసారు.
*ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలను ప్రత్యెక ప్యాకేజి తో ఇస్తున్నామని భాజాపా నేత పురందేశ్వరి పూనరుద్ఘాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆవిడ పర్యటించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పూర్తిగా కేంద్రమే భరిస్తుందని చెప్పారు.
* కర్నూలు జిల్లా తెలుగుదేశంలో వర్గ విభేదాలు ముదిరాయి. శిల్పా మోహన్ రెడ్డి, భుమా నాగిరెడ్డి ఆదివారం జరిగిన సమన్వయ కమీటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి సమక్షంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.
* ఎన్నికల కమీషన్ కేజ్రీవాల్ కు గట్టి షాక్ ఇచ్చింది. గోవాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది.
*ప్రియాంకా కాంగ్రెస్స్ పార్టికి గొప్ప వరఒ వంటిదని ఆమె సోదరుడు రాహుల్ గాంధి ప్రశంసించారు. యూ.పి.లో పొత్తుల విషయంలో ప్రియాంక మంచి చొరవ చూపారని రాహుల్ కొనియాడారు.
* కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, జంగ్రేస్ పార్టి సినియన్ నాయకుడు యస్.యం. కృష్ణా ఆ పార్టికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టి తనను పక్కన పెట్టడం భాధగా అనిపించిందని పార్టి తన సేవలు అవసరం లేదని భావించారని అందుకే ఆ పార్టీ నుండి వైదొలుగుతున్నట్లు కృష్ణా ప్రకటించారు.
* జైపూర్, ఆగ్రా ప్రధాన రహదారి పై ఆదివారం తెల్లవారుజామున పొగ మంచు కారణంగా పెను ప్రమాదం జరిగింది. దాదాపు 30 వాహనాలు ఒక దాని వెంట ఒకటి ఢీ కొన్నాయి. ఒకరు మృతి చెందగా 36 మంది గాయపడ్డారు.
* ప్రత్యేక హోదా సాదించెంతవరకు పోరాడుతూనే ఉంటామని కర్నూల్ వైకాపా ఎంపి బుట్టా రేణుక ఆదివారం నాడు హైదరాబాద్ లో ప్రకటించారు.
* ఆంధ్ర రాష్ట్రానికి అవసమైనన్ని జలాలు అందజేసి పంటలను కాపాడతామని తెలంగాణా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మంలో ప్రకటించారు.
* నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అని మాజీ కేంద్ర ఆర్దిక మంత్రి చిదంబరం విమర్శించారు. ఇది తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు.
* బాహుబలి – 2 తమిళ రైట్స్ ను శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ హోస్ రిలీజ్ హక్కులను పెద్ద మొత్తానికి దక్కించుకున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
* వైకాపా కు చెందిన ఎంపీలు ఆదివారం నాడు హైదరాబాద్ లో జగన్ తో సమావేశం అయ్యారు. తమ నాయకుడి ఆదేశాల మేరకు ప్రత్యేక్ హోదా కోసం రాజీనామా చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
* తెలంగాణా లో క్యాబినెట్ హోదాల వ్యవహారం మరోసారి కోర్టుకెక్కింది. టిడిపి నాయకుడు రేవంత్ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా క్యాబినెట్ హోదా అనుభవిస్తున్న వారి పదవులను రద్దు చేయాలని హైకోర్టు లో “పిల్” దాఖలు చేశారు.
* తాను నెంబర్ 1 కూలిగా 24 గంటలు రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విలేకరులకు వెల్లడించారు.
* తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మెహబూబ్ ఆలి కి స్వైన్ ఫ్లూ జ్వరం సోకింది.
* వరంగల్ లో నెల రోజుల వ్యవధిలో పాస్ పోర్ట్ కార్యాలయం పని చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.
* విజయవాడ లో మహిళా పోలీసులు వివిధ సెంటర్ లలో మారు వేషాలతో సంచరిస్తూ యువతులను వేధించే పోకిరిలను పట్టుకుంటున్నారు. గత రెండు రోజుల్లో దాదాపు 15 మందిని మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు.
* వైఎస్ జగన్ విశాఖను నాశనం చేయాలని చూస్తున్నాడని ఆయన తల్లి విజయమ్మను ఓడించినందుకు ఇక్కడి ప్రజలపై కోపం పెంచుకున్నాడని రాజ్యసభ సభ్యుడు సీ.యం. రమేష్ వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com