ఈ సారి అమ్మలపై

‘‘సరోగసీ విధానంలో నా చిన్న కుమారుడు ఆజాద్‌ పుట్టినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. ఒకప్పుడు వూహించడానికే సాధ్యం కాని విషయాలు నేడు వైద్యరంగంలోని అద్భుతాలతో నిజమవుతున్నాయి. నాకు సంతాన భాగ్యాన్ని అందించిన సరోగసీపై అవగాహన కల్పించేందుకు అవసరమైతే ఓ సినిమా తీసే ఆలోచన ఉంద’’న్నారు ఆమీర్‌ ఖాన్‌. సరోగసీపై జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్‌ విలేకర్ల ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం తెలిపారు. స్క్రిప్టు నచ్చితే ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తానని చెప్పారు ఆమీర్‌. ప్రస్తుతం ‘దంగల్‌’లో మల్లయోధుడిగా నటిస్తున్న ఆమీర్‌ ఆ తర్వాత ‘థగ్‌’ పేరుతో ఓ చిత్రం చేయబోతున్నారు. అందులో అమితాబ్‌ బచ్చన్‌తో కలసి ఆమీర్‌ తెరను పంచుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై ఆమీర్‌ స్పందిస్తూ ‘‘నేను అమితాబ్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనంటే నాకు ఎంతో గౌరవం, అభిమానం. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నా. అమితాబ్‌తో కలసి నటించే అవకాశం వస్తే నా కల నిజమైనట్లే. అది జరగాలని కోరుకుంటున్నా. అయితే ‘థగ్‌’లో ఆయన నటించే విషయం గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపడినట్లే. సమయం వచ్చినప్పుడు చెబుతాన’’న్నారు ఆమీర్‌.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com