ఉపవాసం వలన ఆయువు పెరుగుతుంది-హార్వార్డ్

తరచూ ఉపవాసం ఉండటం వల్ల ఆయువు పెరుగుతుందని వింటుంటాం.. ఇందుకు కారణాలను సశాస్త్రీయంగా హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. కణాల్లోని మైటోకాండ్రియా నెట్‌వర్క్‌ల చర్యలను మార్చడం ద్వారా ఉపవాసం ఆయువును పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ మైటోకాండ్రియానే కణాలకు అవసరమైన శక్తిని తయారు చేస్తుంది. హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు నులిపురుగులపై ప్రయోగాలు చేశారు. రెండు వారాల పాటే బతికే ఈ నులిపురుగులకు అందే ఆహారాన్ని నియంత్రించినప్పుడు వేర్వేరు కణాల్లోని మైటోకాండ్రియాలు స్థిరంగా ఉండిపోయినట్లు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో మైటోకాండ్రియా ఒక దశ నుంచి ఇంకోదశకు సులువుగా మారేందుకు ఈ ప్రక్రియ వీలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉపవాసం కారణంగా మైటోకాండ్రియా.. ఆక్సిజన్‌ సాయంతో కొవ్వులను మండించే భాగాలైన పెరాక్సీసోమ్స్‌ మధ్య సమన్వయం కూడా పెరిగిందని తెలిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com