ఉరిశిక్షకు పెన్సిల్వేనియా గవర్నర్ మోకాలడ్డు

జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసం పదినెలల పాపను, ఆమె అమ్మమ్మను కిరాతకంగా హతమార్చిన కేసులో రఘునందన్‌ యండమూరికి అమెరికా కోర్టు విధించిన మరణదండన వాయిదాపడే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. పెన్సిల్వేనియాలో తన పొరుగింట్లో ఉంటున్న తెలుగు కుటుంబంలోని పదినెలల శాన్విని డబ్బుల కోసం కిడ్నాప్‌ చేసి..అడ్డొచ్చిన ఆమె అమ్మమ్మ సత్యవతిని చంపి, అనంతరం ఆ చిన్నారినీ హతమార్చిన కేసులో రఘుకు శిక్ష పడింది. అతడికి విషపూరిత ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా మరణశిక్షను అమలు చేయాలని 2014లో పెన్సిల్వేనియా కోర్టు ఆదేశించింది. ఈ శిక్షను వచ్చేనెల 23న అమలు చేయాలని అధికారులు నిర్ణయం కూడా తీసుకొన్నారు. ఈ విషయాన్ని గురువారం జైలు అధికారులు ధ్రువీకరించారు. అతడికి శిక్ష అమలయితే, అమెరికాలో మరణదండనకు గురైన తొలి ఇండో అమెరికన్‌గా రఘు నిలుస్తాడని అంతా భావించారు. అయితే, అతడికి శిక్ష పడిన పెన్సిల్వేనియా రాష్ట్రంలో 2015నుంచి మరణశిక్షలపై మారటోరియం కొనసాగుతోంది. ఆ మారటోరియాన్ని ఈ రాష్ట్ర గవర్నర్‌ తొలగించేదాకా.. మరణశిక్షలు అమలు చేయడానికి ఉండదు. ఈ నేపథ్యంలో రఘుకు విధించిన శిక్ష అమలయ్యే అవకాశం దాదాపు లేనట్టేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘‘కోర్టు తీర్పును నిలిపివేయాలని గవర్నర్‌ (పెన్సిల్వేనియా) ఆదేశించలేదు. కాకపోతే శిక్ష అమలును వాయిదా వేసేలా ఉత్తర్వులను జారీ చేయనున్నారు’’ అని ఈ వర్గాలు వివరించాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com