ఉసురు తగులుతుంది

రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్‌కు క్షేమదాయకం కాదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్‌కు క్షేమదాయకం కాదన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్‌ యార్డ్‌గా మార్చడం ఎంత వరకు న్యాయమో ప్రజాప్రతినిధులు చెప్పాలి. భూముల సేకరణకు ముందు ఎంత మేరకు నష్ట పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో.. అంత మొత్తం ఇవ్వాలి. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా వివక్షత పాటించడం మంచిది కాదు. ఒక వేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలేయాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది’ అని పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ‘ఈ భూముల రైతులు తమ వారు కాదనా.. లేదా కాంట్రాక్టర్‌కు ఇబ్బందనా.. గత్యంతరంలేని రైతులు తగిన నష్టపరిహారం చెల్లించమని అడిగితే వారి మొర ఎందుకు వినరు. పోలవరం రైతులు ఇప్పటికే పలు రకాలుగా నష్టపోయారు. ఇది అన్యాయం అని అడితే పోలీసులతో కేసు పెట్టించి వారి నోరు మూయిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇకనైనా వారికి న్యాయం చేయండి. అమరావతిలోని కృష్ణానది లంక భూముల రైతుల బాధను సమాజ వికాసాన్ని ఆకాంక్షించే వారు అర్థం చేసుకోవలసి ఉంది. తాము దళితులం అయినందువల్లే నష్టపరిహారం చెల్లింపులో వివక్షకు గురవుతున్నామని ఈ ప్రాంత రైతులు ఆవేదనతో ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదు’ అని పవన్‌కల్యాణ్‌ వరస ట్వీట్లు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com