ఎండదెబ్బను తిప్పికొడదాం ఇలా

వడదెబ్బ.. దీనినే ఎండదెబ్బ అనీ అంటారు. ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమై ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వేడి వాతావరణం లేదా చురుకైన పనుల వల్ల కలిగే అధికవేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు శరీరం ప్రాథóమిక అవయవాలు విఫలమయ్యేలా చేస్తాయి. వేడికి సంబంధించిన సమస్యలలో వడదెబ్బ చాలా తీవ్రమైంది. సరైన మోతాదులో సరైన ద్రవపదార్థాలు తీసుకోకుండా బరువైన, కష్టమైన పని చేసినప్పుడు ఇలా జరుగుతుంది.
వడదెబ్బ ఎవరికి తగులుతుంది?ఎవరికైనాతగలొచ్చు. కానీ, పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మధుమేహులు, మద్యం సేవించేవారు తొందరగా వడగెబ్బకు గురవుతారు. వేడిమి అలవాటు లేనివారు కూడా తొందరగా వడదెబ్బ బాధితులవుతారు. కొన్ని మందులూ మనిషిని వడదెబ్బకు గురయ్యేలా చేస్తాయి.
**లక్షణాలు
వడదెబ్బలో కనబడే ముఖ్య లక్షణం స్పష్టంగా అధికమైన శరీర ఉష్ణోగ్రత (104 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ కంటే ఎక్కువ). దీంతోపాటు వ్యక్తిగత ప్రవర్తనలో మార్పులూ కనబడతాయి. ఇవి అయోమయం నుంచి అపస్మారకస్థితి వరకూ ఉండొచ్చు.
ఇతర గుర్తులు, లక్షణాల్లో కొన్ని…
**గుండె/నాడి కొట్టుకోవడం.. వేగంగా / తక్కువ శ్వాస తీసుకోవడం.. ఎక్కువ / తక్కువ రక్తపోటు.. చెమట పట్టకపోవటం.. చిరాకు, కంగారు/ అపస్మారక స్థితి, తల తిరగటం / తేలిపోవటం, తలపోటు, వికారం (వాంతులు), పెద్ద వారిలో స్పృహ కోల్పోవడం ప్రధాన లక్షణాలు.
**తీవ్రతలో కనిపించే లక్షణాలు
మానసిక కలత.. శ్వాస ప్రక్రియ వేగంగా జరగడం.. శరీరం తిమ్మిరి, చేతులు, కాళ్లల్లో బాధాకరమైన ఈడ్పులు.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం.
**ప్రాథమిక చికిత్స
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లబరచాలి. వీలయితే రోగిని చల్లని నీటిలో ముంచాలి (టబ్‌ వంటివి లభిస్తే). చల్లటి, తడి బట్టలలో చుట్టాలి. చల్లని తడిబట్టతో ఒళ్లంతా అద్దుతూ ఉండాలి.రోగి శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీ ఫారెన్‌హీట్‌కు పడిపోయినప్పుడు.. చల్లటి నీటిలో నుంచి తీసేసి, చల్లటి గదిలో పడుకోబెట్టాలి.
ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లయితే మళ్లీ పైవిధంగా సూచించినట్లుగా చేయాలి. రోగి తాగగలిగితే చల్లని పానీయాలు ఇవ్వాలి. ఎటువంటి మందులూ ఇవ్వకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
**ఎలా ఆపాలి?
బయట పనులు చేసేటప్పుడు ఎక్కువగా పానీయాలు తాగి, శరీర ఉష్ణోగ్రతను మామూలుగా ఉంచుకోవాలి. కెఫీన్‌ / మద్యానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి జల వియోజనాన్ని కలిగిస్తాయి. లేత రంగు, వదులైన దుస్తులను ధరించాలి. శరీరంలో నీటి స్థాయిని తటస్థపరచడానికి తరచూ నీరు తాగుతుండాలి. ఎక్కువ విరామం తీసుకోవాలి. ఎక్కువ ఎండలో తిరక్కూడదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com