ఎండిపోనివ్వని చంద్రుడు

పంట సంజీవిని కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 64,990 పంటకుంటలు పూర్తయినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మరో 3.50 లక్షల పంటకుంటల పనులు పురోగతిలో ఉన్నాయని విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 2.51మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గొలుసుకట్టు చెరువులు తీసుకొచ్చామని, చెక్‌డ్యామ్‌లు పూర్తిచేస్తున్నామన్నారు. సాగునీరు లేక రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాయలసీమలోని వర్షాభావ ప్రాంతాల్లో రెయిన్‌గన్ల ద్వారారక్షక తడులను అందించి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వర్షాలు పడకపోతే పంటలు ఎండిపోతాయని ఆందోళన పడిన రైతులను రెయిన్‌గన్ల ద్వారా ఆదుకున్నామన్నారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచేలా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కరవు పరిస్థితుల్లోనూ రైతులు వలసపోకుండా చేయగలిగినట్లు పేర్కొన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి.. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com