ఎండు ఫలాలు ఎలాగైనా సరే తప్పక తినాలి

*బరువును తగ్గించే బాదం పప్పు
బరువు తగ్గడానికి, నరాల బలహీనత నివారణ, గుండె సంబంధిత వ్యాధులను అరికట్టేందుకు, చెడు కొవ్వును శరీరంలో లేకుండా చేసేందుకు బాదం పప్పు సహకరిస్తుంది. ఎముకల దృఢత్వానికి సైతం పనికొస్తుంది. చిన్నారుల్లో జ్ఞాపకశక్తి మెరుగయ్యేందుకూ సహకరిస్తుంది. అలా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. రోజూ ఓ నాలుగైదు గింజలు తీసుకోవాలి.
*శుక్రకణాల వృద్ధికి వాల్‌నట్‌
ఛాతి క్యాన్సర్‌ బారినపడకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటు ప్రమాదాలనూ తగ్గిస్తుంది. శుక్ర కణాలను వృద్ధి చేస్తుంది. శరీరంలో రక్తం మెరుగయ్యేందుకు వాల్‌నట్స్‌ ఉపకరిస్తాయి. నరాల బలహీనతతో బాధపడేవారికి సైతం ఇది ఉపశమనం కలిగిస్తుంది. రోజూ ఒకటి రెండు తీసుకుంటే సరిపోతాయి.
*పిస్తాషియోస్‌
రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంపొందిస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడేందుకు, కళ్ల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో వ్యాధులు రాకుండా ఉండేలా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఊబకాయాన్ని తగ్గించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని మితంగానే తీసుకోవాలి.
*ఖర్జూర
శరీరంలో చెడు కొవ్వును తగ్గించేందుకు, కండరాలను గట్టిపరుస్తుంది. బీపీని నియంత్రించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. నీరసంగా ఉన్నవారికి తక్షణ శక్తిని ఇస్తుంది. అసిడిటీ, అల్సర్‌ తగ్గుముఖం పడతాయి. అలసటను దూరంగా ఉంచుతుంది. రోజూ ఆరు పండ్లు తినాలి.
*జీడిపప్పు
రక్తపోటు అదుపులో ఉంచడం, క్యాన్సర్‌ వ్యాధులను అరికట్టడం, శరీరానికి సోకే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లతో పోరాడేందుకు ఉపయోగపడుతుంది. ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ రెండు నాలుగు పప్పులు తీసుకుంటే సరిపోతుంది.
*డీహైడ్రేటెడ్‌ కివి
మధుమేహం, ఆస్తమా బారిన పడకుండా ఉంచుతుంది. 27 రకాల పండ్లలో లభించే పోషకాలు ఇందులో లభిస్తాయి. విటమిన్‌-సి రెట్టింపు మోతాదులో ఉంటుంది. యాపిల్‌ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. బరువును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్త సరఫరాను మెరుగుపరిచి గుండెపోటు తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. మల బద్దకాన్ని నివారిస్తుంది. పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది.
*డీహైడ్రేటెడ్‌ పైనాపిల్‌
చర్మాన్ని సున్నితంగా ఉంచడం, మృతకణాలను తొలగించడంలో ఎంతో సాయపడుతుంది. గాయాలను త్వరగా తగ్గిస్తుంది. ఇది యాంటీక్యాన్సర్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.
*కిస్‌మిస్‌
హై బీపీ, ఒత్తిడిని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది. జ్వరం, జలుబు వంటి వాటి నుంచి దూరంగా ఉంచుతుంది. పళ్లను బలంగా ఉంచుతుంది. ఐరన్‌ ఎక్కువగా ఉండటంతో రక్తహీనతను నివారిస్తుంది. ఉదయాన్నే ఎండు ద్రాక్ష తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు ఉపయోగ పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి.
*అంజీర
బరువు తగ్గాలనుకునే వాళ్లు అంజీర పళ్లు రోజూ రెండు మూడు తింటే లావు తగ్గుతారు. బహిష్టు ఆగిపోయిన మహిళలు రొమ్ము క్యాన్సర్‌ రాకుండా కాపాడుకోగలరు. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. దీనిలో పెక్టిన్‌ అనే ఎంజైమ్‌ కొవ్వును తగ్గిస్తుంది.
*బెర్రీస్‌
బెర్రీస్‌లో విటమిన్‌-సి ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కంటికి, చర్మానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్స్‌ ఉంటాయి. చెడు కొవ్వును తగ్గిస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండేలా చూస్తుంది.
*బ్రెజిల్‌ నట్‌
సెలీనియం అధిక మొత్తంలో కలిగిన మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా, మగ వారిలో టెస్టోస్టిరాన్‌ లెవల్స్‌ను పెంచి శుక్రకణాలను అభివృద్ధి చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.గుండెపోటు ప్రమాదాలను తగిస్తుంది. బ్యాక్టీరియా/వైరస్‌ ఇన్ఫెక్షన్స్‌ను తగ్గిస్తుంది.
*ప్రూన్స్‌
కార్డియో వాస్కులర్‌ డిసీసెస్‌, టైప్‌-2 డయాబెటిస్‌ నుంచి కాపాడుతుంది. చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకల్లో గట్టిదనాన్ని పెంచుతుంది. విటమిన్‌ సి, కె ఎక్కువగా లభిస్తాయి.గ్యాస్‌ సమస్యలను తగ్గిస్తుంది.
*పైన్‌నట్‌
విటమిన్‌ ఏ అధికంగా ఉంటుంది. కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు సహకరిస్తుంది. ఇందులో యాంటీఏజింగ్‌ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఆకలి తగ్గించి బరువు తగ్గించేందుకు సహకరిస్తుంది.
*ఆప్రికాట్‌
దీనిలో సహజమైన చక్కెర నిల్వలు ఉంటాయి. విటమిన్‌-ఎ, కాల్షియం ఎక్కువే. అంతే కాకుండా మాంసకృత్తులు అధిక మొత్తాల్లో ఉంటాయి. ఆహారానికి ముందు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. తర్వాత తీసుకుంటే అరుగుదల పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇనుముతో పాటు రాగి కొద్ది మొత్తంలో ఉంటుంది. చర్మవ్యాధులు తగ్గుతాయి.
*డీహైడ్రేటెడ్‌ లెమన్‌
సాధారణ జలుబు, జ్వరం బారిన పడకుండా ఆపుతుంది. జట్టు పెరుగుదలను పెంచుతుంది. చుండ్రును అరికడుతుంది. గాయాలపై యాంటీ సెప్టిక్‌లా పనిచేస్తుంది. విటమిన్‌ సి విరివిగా లభిస్తుంది.
*డీహైడ్రేటెడ్‌ ఆపిల్‌
చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. బరువు పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. బ్లడ్‌ షుగర్‌ను రెగ్యులేట్‌ చేస్తుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
*మెకడామియ
తక్షణశక్తిని ఇస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది. బరువును నియంత్రిస్తుంది. ఎముకలను దృఢంగా చేయడం, గుండె పనితీరు, జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
*హాజిల్‌నట్‌
నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేయడంతో పాటు, చర్మ సంబంధిత క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఎముకలు, గుండెను, జీర్ణక్రియను కాపాడుతుంది. చర్మ సౌందర్యానికి, కళ్లకు బాగా పనిచేస్తుంది.
*పెకాన్‌
జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు పెరుగుదలను పెంపొందిస్తుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు ఎముకలను, పళ్లను దృఢంగా చేస్తుంది. క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలను పూర్తిగా తగ్గిస్తుంది.
*గోజు బెర్రి
ఇమ్యూనిటి పెంచి ఫ్లూ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. కంటికి, చర్మానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్స్‌ను అందిస్తాయి. టెస్టోస్టిరాన్‌ లెవల్స్‌ను పెంచుతుంది. మంచి నిద్రను ఇస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com