ఎంత…900కోట్లే నష్టం

గత కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకుంటున్న ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ స్నాప్‌చాట్‌ కంపెనీ ఆదాయం భారీగా పడిపోయింది. పాప్‌ సింగర్‌ రిహన్నా ఆగ్రహం కారణంగా ఆ కంపెనీకి సుమారు రూ.9వేల కోట్ల మేర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఇవాన్‌ స్పైగల్‌ సంపద దాదాపు 150 మిలియన్‌ డాలర్లు ఆవిరయ్యింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.900కోట్లకు పై మాటే. ఈ విషయాన్ని ఫోర్బ్‌ వెల్లడించింది. ప్రసుత్తం ఇవాన్‌ సంపద 3.8బిలియన్‌ డాలర్లుగా ఉంది. గతవారం స్నాప్‌చాట్‌ రూపొందించిన ఓ యానిమేటెడ్‌ వీడియోగేమ్‌ తనను కించపరిచేలా ఉందని రిహన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో రిహన్నాపై ఆమె బాయ్‌ఫ్రెండ్‌ బ్రౌన్‌ దాడి చేయడాన్ని ఆధారంగా చేసుకొని ఈ యాడ్‌ను రూపొందించారు. దీనిపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్నాప్‌చాట్‌ యాప్‌ను డిలీట్‌ చేయాల్సిందిగా ఆమె తన అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా నష్టపోవడం వల్ల కంపెనీకి రూ.9వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. సదరు యాడ్‌పై కంపెనీ రిహన్నాకు క్షమాపణలు చెప్పింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com