ఎంపీలో బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఇవాళ మధ్యప్రదేశ్‌లో ప్రారంభమైనట్లు చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. 18 రోజులపాటు అక్కడ షూటింగ్‌ జరగనున్నట్లు పేర్కొంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని తదితరులు పాల్గొంటున్నట్లు పోస్ట్‌ చేసింది. ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లముడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com