ఎదురుచూపులు

వయసు గురించి తాను అస్సలు పట్టించుకోనని, తన దృష్టిలో అదొక నంబర్ మాత్రమేనని చెప్పింది చెన్నై సొగసరి శృతిహాసన్. అమెరికాలోని లాస్‌ఏంజిలస్‌లో తన 32వ జన్మదిన వేడుకల్ని జరుపుకుంది. కొందరు సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆనందంగా గడిపానని శృతిహాసన్ పేర్కొంది. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో వరుస అపజయాలు పలకరించాయి. ఒకానొక దశలో సినిమాల్లో కొనసాగడం కష్టమనుకున్నాను.అయితే నా ప్రయత్నాల్ని ఏమాత్రం విరమించకుండా ఓపికతో విజయం కోసం ఎదురుచూశాను. ఇప్పుడు కెరీర్ విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. సక్సెస్‌కు ఓర్పు చాలా ప్రధానమనే విషయం నాకు అవగతమైంది. వృత్తిపరమైన, వ్యక్తిగత విషయాల్ని సమన్వయం చేసుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాను అని తెలిపింది. నటనతో పాటు సంగీతం అంటే తనకు ప్రాణమని..ఈ ఏడాది మ్యూజిక్ ఆల్బమ్ చేసే ఆలోచనతో వున్నానని చెప్పింది. ప్రస్తుతం శృతిహాసన్ తన తండ్రి కమల్‌హాసన్ నటిస్తున్న శభాష్‌నాయుడు చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com