ఎన్నో రుగ్మతలకు తొలి మందు – నిమ్మరసం

నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుంది?! ఆ వాసన నచ్చని వారెవరైనా ఉంటారా? అలాంటి తాజా నిమ్మకాయలో ఉన్న ఆరోగ్య సుగుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో తెలుసుకుందామా…
*మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో నిమ్మరసం తోడ్పడుతుంది.
స్ర్టోక్స్‌ను నివారిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
*ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంది. దీంతోపాటు విటమిన్‌ బి6, విటమిన్‌-ఎ, ఇ, నియాసిన్‌, థయామిన్‌, రిబోఫ్లావిన్‌, మెగ్నీషియం, పొటాషియం,ప్రొటీన్లు ఉన్నాయి.
*కాన్సర్‌పై గట్టి పోరు చేస్తుంది. మలబద్దకం, రక్తపోటు, జ్వరం, జీర్ణశక్తి సమస్యలపై బాగా పనిచేస్తుంది.
*వీటితోపాటు చర్మం, శిరోజాలు, దంతాల అందాల్ని కాపాడే గుణాలు నిమ్మలో ఉన్నాయి.
*నిమ్మ రక్తాన్ని శుద్ధిచేసే క్లీన్సర్‌ ఏజెంట్‌.
*జ్వరం, జలుబు, దగ్గు బాధలను తగ్గిస్తుంది.
*నిమ్మని దంతసంరక్షణలో ఎక్కువగా వాడతారు. నోటిదుర్వాసన రాకుండా కూడా ఇది నివారిస్తుంది.
*నిమ్మరసం మాడుమీద రాసుకోవడం వల్ల చుండ్రు తగ్గడమే కాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అంతేకాదు జుట్టుకు సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది.
*నిమ్మరసాన్ని నేరుగా వెంట్రుకలకు రాసుకుంటే అవి సహజమైన నల్లని రంగుతో బాగా మెరుస్తాయి.
*నిమ్మరసం సహజసిద్ధమైన యాంటిసెప్టిక్‌ మెడిసెన్‌. ఇది చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది.
*సన్‌బర్న్‌ వల్ల తలెత్తే నొప్పి నిమ్మరసం వల్ల పోతుంది.
*యాక్నె, ఎగ్జిమాల మీద కూడా నిమ్మ బాగా పనిచే స్తుంది.
*యాంటి ఏజింగ్‌ గుణాలు దీంట్లో ఉన్నాయి.
*చర్మం మీద ముడతలను పోగొడుతుంది.
*నిమ్మకాయరసంలో కొద్దిగా తేనె వేసుకుని రోజూ ఉదయమే తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
*కాలిన పాత గాయాల మచ్చలపై నిమ్మరసం పూస్తే ఆ మచ్చలు పోతాయి.
* చర్మం కాలినపుడు ఆ మంటను తగ్గిస్తుంది.
*దీంట్లో యాంటిసెప్టిక్‌ గుణాలు ఉండడంతో శరీరంలో అంతర్గతంగా సంభవించిన రక్త స్రావాన్ని సైతం ఆపగలదు.
*నిమ్మరసంలో కొద్దిగా తేనె, గోరువెచ్చటి నీళ్లు కలిపి రోజూ తాగితే బరువు తగ్గుతారు.
*ఊపిరితిత్తుల సమస్యల నుంచి కూడా నిమ్మ సాంత్వననిస్తుంది.
*కలరా, మలేరియా వంటివి జబ్బులను నిమ్మ నివారించగలదు. ఎందుకంటే *మందే పేర్కొన్నట్టు నిమ్మలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది.
* గొంతు ఇన్ఫెక్షన్లపై కూడా నిమ్మ బాగా పనిచేస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com