ఎప్పుడు అదే పనిలో

‘తను వెడ్స్‌ మను’.. ‘రంజానా’.. ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్‌. ఇప్పటివరకు సహాయపాత్రలతోనే సరిపెట్టుకున్న ఈమె.. ప్రస్తుతం కరీనా కపూర్‌.. సోనమ్‌ కపూర్‌లు నటిస్తున్న ‘వీర్‌ ది వెడ్డింగ్‌’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అయితే సహాయపాత్రల నుంచి ప్రధాన పాత్రలు పోషించే స్థాయికి ఎదగడంపై ఎలా ఫీలవుతున్నారని అడగ్గా ఈ విధంగా చెప్పుకొచ్చింది. ‘‘ఏ నటుడైనా నేను హీరోని.. క్యారెక్టర్‌ ఆర్టిస్టు అని ఫీలవ్వడు. ఎందుకంటే నటుడంటే నటుడు అంతే. కాలేజీ అయిపోగానే సినిమా అవకాశాలను వెతుక్కుంటూ ముంబయికి వచ్చాను. నాలాగే చాలామంది వస్తుంటారు. అవకాశాలు రావాలంటే ఏ పాత్ర దొరికినా దానితో మన టాలెంట్‌ని నిరూపించుకోవాలి. ప్రధాన పాత్రలో అవకాశం వచ్చినపుడే చేస్తానని పట్టుబట్టి కూర్చోవద్దు. నేను ఎప్పుడూ ప్రధాన పాత్రతోనే తెరంగేట్రం చేస్తానని వూరుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వచ్చా. ఈ క్రమంలోనే ‘నీల్‌ బత్తే సన్నాటా’లో ప్రధానపాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఒక్క సినిమా విజయం సాధిస్తే సరిపోదు. షారుఖ్‌ఖాన్‌.. సల్మాన్‌ ఖాన్‌లా మంచిపేరు తెచ్చుకుని ఇండస్ట్రీలో ఉండాలంటే నిరంతరం కష్టపడుతూనే ఉండాలి’’ అంటూ చెప్పుకొచ్చింది. ‘‘స్నేహితురాలిగా.. సోదరిగా చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే ఒకసారి నటిస్తే ప్రతిసారి అలాంటి పాత్రలే వస్తుంటాయి. కాకపోతే వాటిని ఒప్పుకోవాలా లేదా అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రలు చేయడానికి పెద్దఇబ్బందేమీ లేదు. చాలామంది వద్దని వదిలేసిన పాత్రలనే మొదటి నుంచి చేసుకుంటూ వచ్చాను. ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’లో సోదరిగా గానీ.. ‘నీల్‌ బత్తే సన్నాటా’లో ముప్పై ఏళ్లు పైబడిన తల్లి పాత్రలో.. ‘రంజానా’లో హీరోని పిచ్చిగా ప్రేమించే యువతి పాత్రలో నటించేందుకు చాలామంది ఒప్పుకోలేదు. నేను ఒప్పుకున్నా. మొదట ఈ తరహా పాత్రలు ఎంచుకున్నపుడు చాలామంది వద్దని వారించారు. వారి మాటలను వినిపించుకోలేదు. అలా ఎవరూ చేయడానికి ఇష్టపడని పాత్రలను ఎంచుకొని నాకంటూ ఇండస్ట్రీలో ఓ స్థానాన్ని ఏర్పరచుకుంటూ వస్తున్నా. ఎదుటివారు చెప్పినవన్నీ చేసుకుంటూ పోతే.. మన తప్పుల్ని ఎంచే అవకాశాలు వాళ్లకు దొరకవు కదా!’’ అని సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది స్వరభాస్కర్‌.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com