ఎప్పుడైనా పిలుస్తారా?

ఒకప్పటి టీమిండియా ఆల్ రౌండర్ గా సేవలందించిన ఇర్ఫాన్ పఠాన్ తన పునరాగమనం కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నాడు. గత మూడు సంవత్సరాల క్రితం గాయాలు వెన్నంటి పేలవమైన ఫామ్ తో జట్టులో స్థానం కోల్సోయిన ఇర్ఫాన్ .. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు తనవంతు కృషి చేస్తూనే ఉన్నాడు. ఇర్ఫాన్ తిరిగి జట్టులోకి రావాలని ప్రయత్నిస్తున్నా.. అది అతనికి అందని ద్రాక్షగానే ఉంది. కాగా, మరోసారి జాతీయ జట్టుకు ఆడాలన్న కోరిక మాత్రం అతని మదిని వెంటాడుతూనే ఉందని స్పష్టం చేశాడు. దీనిలో భాగంగా ఇటీవల రంజీ మ్యాచ్ ల్లో బరోడా తరపున ఆడిన ఇర్ఫాన్ తన ఫామ్ ను చాటుకున్నాడు. కేవలం రెండు మ్యాచ్ లు ఆడి 90 పరుగులు చేశాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఇర్ఫాన్(73) హాఫ్ సెంచరీ చేయడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు. దీంతో పాటు పంజాబ్ తో జరిగిన మరో మ్యాచ్ లో కూడా రాణించాడు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి ఆరు వికెట్లు తీశాడు. ఈ గణాంకాలను జాతీయ క్రికెట్ టీమ్ సెలెక్టర్లు పరిగణిలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ తో ఉన్న తాను జాతీయ టీమ్ లో పిలుపు కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు. ‘ఇంకా నేను జాతీయ జట్టుకు ఆడతాననే నమ్మకం ఉంది. నేను ఫామ్ లో ఉన్నట్లయితే సెలెక్టర్లు కచ్చితంగా గుర్తిస్తారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే ప్రతీ ఆటగాడు జాతీయ జట్టుకు ఆడాలని అనుకుంటాడు. ఆటతో నా పని నేను చేసుకుంటూ పోతే అవకాశం అదే వస్తుంది. నా ఆటను మరింత మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడమే నా లక్ష్యం’అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఇర్ఫాన్ వన్డేల్లో 120 మ్యాచ్ లు ఆడి 173 వికెట్లు తీయగా, 1,544 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో 29 టెస్టులు ఆడిన 100 వికెట్లు తీసి, 1,105 పరుగులు చేశాడు. ఇర్ఫాన్ చివరిసారి 2012 ఆగస్టులో వన్డే మ్యాచ్ ఆడాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com