ఎయిరిండియాలో లైంగిక అరాచకాలు

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు అందులో పనిచేస్తున్న ఎయిర్‌హోస్టెస్‌(గగనసఖి)పై గత కొన్నేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీన్ని ఎయిరిండియా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో సదరు బాధితురాలు విమానయానశాఖ మంత్రి సురేశ్‌ప్రభు, ప్రధాని మోదీకి లేఖ రాసింది. సదరు ఎగ్జిక్యూటివ్‌ను హాలీవుడ్‌ దర్శకుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హార్వే వెన్‌స్టీన్‌తో ఆమె పోల్చారు. ‘గత ఆరేళ్లుగా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు నా పట్ల మృగంలా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా నన్ను వేధింపులకు గురి చేస్తూ అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగిస్తూ నన్ను తిడుతున్నాడు. ఇతర మహిళల ముందు నాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను అవమానపరుస్తున్నాడు. అతడికి లొంగకపోయేసరికి నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నా జీవితం కష్టాల్లో పడింది’ అంటూ గగనసఖి కేంద్రమంత్రి సురేశ్‌ ప్రభుకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై స్పందించిన మంత్రి ఎయిరిండియా సీఎండీని వెంటనే ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అవసరమైతే వేరే కమిటీని ఏర్పాటు చేసి అయినా.. విచారణ జరపాల్సిందిగా మంత్రి అధికారులకు సూచించారు. ఎగ్జిక్యూటివ్‌ వేధింపుల విషయంపై ఎయిరిండియాకు గతేడాది సెప్టెంబరులోనే ఫిర్యాదు చేసినప్పటికీ.. వాళ్లు పట్టించుకోలేదని ఆమె వాపోయారు. ఫిర్యాదులు పరిశీలించే కమిటీకి ఫిర్యాదు చేయగా.. వాళ్లు ఎగ్జిక్యూటివ్‌కు సమన్లు పంపేందుకు మూడు నెలల సమయం తీసుకున్నారని ఆమె వెల్లడించారు. కానీ ఆయన్ను మాత్రం విచారించలేదని లేఖ ద్వారా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com