ఎయిరిండియా ఉద్యోగులపై లైంగిక వేధింపుల కేసు

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో పనిచేసే ఓ పైలట్‌పై కేరళలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పైలట్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలో వెళ్తున్న సమయంలో సదరు పైలట్‌ తనతో చాలా సార్లు అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ తెలిపింది. గత సెప్టెంబర్‌ 18న విధుల్లో ఉన్న ఆమెపై పైలట్‌ మళ్లీ వేధింపులకు పాల్పడటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక.. పైలట్‌ చర్యతో తాను రాజీనామా చేసినట్లు పేర్కొంది. దీంతో పైలట్‌పై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్‌ 18న విమానంలో పైలట్‌తో పాటు విధుల్లో ఉన్న సిబ్బందిని విచారిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల రాంచీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ఎయిర్‌ఏషియా విమానంలోనూ ముగ్గురు సిబ్బంది ఓ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదుచేసుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com