ఎయిరిండియా విమానసేవ నాణ్యతే కాదు…ట్విట్టర్ కూడా బలహీనమే

భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన అధికారిక ట్విటర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు ఆ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. ఈరోజు ఉదయం కొన్ని గంటల పాటు ఖాతా హ్యాక్‌ అయ్యిందని, తర్వాత దాన్ని తిరిగి పునరుద్ధరించామని తెలిపారు. అధికార ట్విటర్ ఖాతా @airindiain ‌లో టర్కిష్‌ భాషలో సందేశం పోస్ట్‌ చేశారని సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పోస్ట్‌ చేసిన సందేశాలను తొలగించామని, ఖాతా తిరిగి తమ ఆధీనంలోకి వచ్చిందని తెలిపారు. హ్యాకర్స్‌ పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌లో ‘చివరి నిమిషపు ముఖ్యమైన ప్రకటన.. మా అన్ని విమానాలు రద్దయ్యాయి. ఇక నుంచి మేము టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణాలు కొనసాగిస్తాం’ అని రాశారు. ఎయిరిండియా ట్విటర్‌ ఖాతాను దాదాపు 1,46,000 మంది ఫాలో అవుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com