ఎర్రబెల్లి మాతృమూర్తికి కేసీఆర్ నివాళి

పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు పరామర్శించారు. దయాకర్‌రావు మాతృమూర్తి ఆదిలక్ష్మి(84) నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు పర్వతగిరిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పర్వతగిరి చేరుకున్న కేసీఆర్‌.. ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం దయాకర్‌రావును పరామర్శించారు. మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన్ని పరామర్శించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com