ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఎత్తివేత

ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రద్దు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆ వాహనాలను కొనుగోలు చేసిన వ్యక్తులకు కొన్ని ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు వాటిని రద్దు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం ఎలక్ట్రిక్‌ వాహన అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రైవేట్‌ ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ ప్రోత్సాహకాలు.. అమ్మకాలను పెంచడానికి కానీ.. క్లీన్‌ ఎనర్జీని పెంపొందించడానికి ఏ మాత్రం ఉపయోగయపడం లేదు’ అని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 1500 ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే అమ్ముడుపోగా.. పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ వాహనాలు మాత్రం 32 లక్షల వరకూ అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్లు కొన్నవారికి ప్రభుత్వం రూ.1.3 లక్షల వరకూ సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీని ఎలక్ట్రానిక్‌ వాహనాలు వినియోగించే ఓలా, ఉబర్‌ లాంటి షేర్‌డ్‌ మొబైలిటీ ఆపరేటర్లకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని.. వారి వాహనాల సంఖ్య ప్రైవేట్‌ వ్యక్తుల వాహనాల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com