ఎవరి పేరైనా వెంకటప్ప

సాధారణంగా ఒక్కో ఇంటికి ఒక్కో ఇలవేల్పు(ఇంటి దేవత) ఉండటం సహజం. కానీ మక్తల్‌ మండలం దాసర్‌దొడ్డిలో అందరి ఇలవేల్పు ఆ గ్రామ శివారులో వెలసిన వెెంకటేశ్వరుడి నామమే… ఆ స్వామి వారిని భక్తితో కొలిస్తే కష్టాలు తీరుతాయని పేరు తలచుకున్నా చాలని భావిస్తారు. అందుకే పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో ప్రతి ఇంటిలో వెంకటేశ్వరుడి పేరు పెట్టుకుంటారు. ఆ పేరులేని ఇళ్లే లేదంటే అతిశయేక్తి కాదు.. దాసర్‌దొడ్డిలో 350 ఇళ్లు ఉన్నాయి. గ్రామంలో వెంకటప్ప, వెంకటేష్‌, వెంకటరమణ లాంటి పేర్లు ప్రతి ఇంటా ఉన్నాయి. కాలానుగుణంగా వెంకప్ప, వెంకటప్ప, వెంకటేశ్వర్లుగా మార్చుకొని పెట్టుకొని స్వామి వారిపై విశ్వాసం చాటుకుంటున్నారు.
**ఆలయ ప్రాశస్తి
పూర్వం 200 ఏళ్ల కిందట గడ్డి, చెత్తను తొలగించేందుకు గుంటకపై గుండును బరువుగా పెట్టుకొని తోలేవారు. సాయంత్రం గుంటక పొలంలో వదిలి వెళ్లి మరుసటిరోజు వచ్చి చూస్తే ఆ గుండు అక్కడ కనిపించేది కాదని ఓ కథ ప్రచారంలో ఉంది..అక్కడికి అర కిలోమీటరు దూరంలో చింతవనంలో ఆ గుండు ఉండేదట. ఆ రైతు గుండు కదలికలు కనుగునేందుకు ఓ రోజు పొలం వద్దనే నిద్రించాడు. అర్ధరాత్రి దానంతట అదే కదిలి దొర్లుకుంటూ వెళ్లి చింతవనం వద్ద ఆగింది. గుండు వెంట వెళ్లిన రైతు పరిశీలిస్తే గుండుపై శ్రీనివాసుడి నామం కనిపించిందని చెబుతారు. మరుసటి రోజు గ్రామస్థులకు తెలపడంతో ఏడుకొండల వెంకటేశ్వరుడి ప్రతిరూపమే అని భావించి అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టినట్లు గ్రామపెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ వెంకటేశ్వరుడి ఆలయం నిర్మిస్తున్నారు. ప్రతి ఉగాది రోజు గ్రామస్థులు స్వామికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. ఆ నాటి నుంచి అంతా వెంకటేశ్వర స్వామి భక్తులయ్యారు.
**ప్రధాన పార్టీ నాయకుల్లోనూ..
దాసర్‌దొడ్డి గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1425 మంది జనాభా ఉన్నారు. వీరిలో ప్రతి ఇంటా స్వామి పేరు కనపడుతుంది. గ్రామంలోని నాలుగు ప్రధాన పార్టీల నాయకుల్లో ఇదే పేర్లు ఉండటం విశేషం. గ్రామంలో ఇంత వరకు ఎన్నికైన నలుగురు సర్పంచుల పేర్లు వెంకటప్పలే.. ప్రస్తుత సర్పంచి కూడా వెంకటప్పనే. పూర్వీకుల నుంచి వెంకటేశ్వరుడి ఇంటి దేవుడిగా కొలవడం ఆచారంగా వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. స్వామివారి పేరు తలిస్తే శ్రీనివాసుడిని కొలిచినట్లే అనే పేరు పిలవడం గ్రామం సుభిక్షంగా ఉందని వృద్ధులు అంటున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com