ఎస్.వీ.రంగారావుకు పద్మ పురస్కారం ఇవ్వండి

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు చెప్పారు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన తెలుగుతేజం, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు శ్రీకాంత్‌ కిదాంబికి శుభాభినందనలు తెలిపారు. మరింతమంది తెలుగు వారికి అవార్డులు వచ్చి ఉంటే బాగుండేదని పవన్‌ అభిప్రాయపడ్డారు. సినీరంగంలో అలనాటి సహజనటి సావిత్రి, ఎస్వీ రంగారావుకు పద్మ అవార్డులను ప్రకటించాలని కోరారు. ఇందుకోసం కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు చొరవతీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తి, పార్టీల కంటే దేశం, సమాజం ఎంతో ముఖ్యమని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్య సముపార్జన కోసం మహానుభావులెందరో త్యాగాలు చేశారని కొనియాడారు. అలాంటి త్యాగధనుల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్‌ ఈ సందర్భంగా అన్నారు. విడిపోవాలనుకునేందుకు మనుషులకు ఎన్నో కారణాలు ఉంటాయని, జాతి సమైక్యంగా ఉండాలన్న స్ఫూర్తి గణతంత్ర దినోత్సవం గుర్తు చేస్తుందని పవన్‌ అన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com