ఏంది సామీ నువ్వు?

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పై మండిపడ్డారు. ఎందుకనుకుంటున్నారా? దేశంలో అసహనం పెరుగుతుందంటున్న మేధావులతో ఇప్పుడు అమీర్ జతకలిశాడు. నిన్న ఢిల్లీలోని రామ్నాథ్ గోయంకా ఎక్స్లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పలు సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే విషయం నా భార్య కిరణ్రావ్ పలుమార్లు నాతో చర్చించింది. ఓ దశలో ఈ దేశం వదిలి వెళ్దామని ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అసహనంపై అమీర్, ఇతర మేధావుల స్పందనపై వర్మ తీవ్రస్థాయిలో స్పందించారు. హిందూ మతం మెజార్టీగా ఉన్న భారత్లో అమీర్ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లు అతిపెద్ద స్టార్లుగా కొనసాగుతున్నారు. వీరు ముగ్గురు ముస్లీంలే. ముగ్గురు ఖాన్లు స్టార్లుగా కొనసాగడమే ప్రజల సహనానికి నిదర్శనం. దేశంలో మరి అసహనం ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు. అసహనంపై కొందరు ప్రముఖులు ఫిర్యాదు చేస్తున్నరు. గుర్తించతగని విషయాలను అసహనానికి ప్రతీకగా తీసుకోకూడదు. సమాకాలీన అంశాలపై డ్రాయింగ్ రూం చర్చల ద్వారా వారి పాపులారిటీ పెరుగుతదేమో కానీ స్టార్ల స్పందనతో మతాల మధ్య అంతరం మాత్రం పెరుగుతదని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదు చేసే వారిలో ప్రముఖులుగా పిలువబడేవారు చివరలో ఉండాలని ఆయన సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com