ఏడాది కాలంగా వెళ్ళింది 6వేల కన్నా తక్కువే

అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య స్వల్పంగా పెరుగుతున్నా.. పెరుగుదల వృద్ధి శాతం మాత్రం భారీగా పడిపోతోంది. గత రెండేళ్లలో మారిన పరిణామాలతో ఈ పరిస్థితి వచ్చింది. అమెరికాలో మొత్తం పొరుగు దేశాల విద్యార్థుల సంఖ్య 12 లక్షలకు చేరుకోగా.. అందులో చైనా విద్యార్థులే 3.20 లక్షలకుపైగా ఉన్నారు. ఆ తర్వాత సుమారు 2 లక్షలతో భారత్‌ది రెండో స్థానం.

* 2016 జులై నాటికి అమెరికాలో 3,23,186 మంది చైనా విద్యార్థులున్నారు. 2015తో పోల్చితే 7.2 శాతం పెరిగారు. అదే సమయంలో మన దేశ విద్యార్థుల సంఖ్య 28.5 శాతం పెరిగి 1,92,723కు చేరుకుంది.
* 2014 అక్టోబరు, 2015 డిసెంబరు నాటి విద్యార్థుల సంఖ్యను పోల్చిచూస్తే 14 నెలల్లో భారత విద్యార్థుల్లో 34.8 శాతం వృద్ధి కనిపించింది.
* తాజా గణాంకాల ప్రకారం 2016 నవంబరు, 2017 డిసెంబరు మధ్య పెరిగిన విద్యార్థులు కేవలం 2.7 శాతం మాత్రమే. అంటే 13 నెలల్లో పెరిగిన విద్యార్థులు కేవలం 5,644 మంది మాత్రమే. అక్కడ చదువుతున్న వారే తప్ప కొత్తగా వెళ్లేవారు తగ్గిపోయారు. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం భారత్‌కు ఇచ్చిన నివేదికలోని గణాంకాలు ఇవి.

2016లో భారత్‌ నుంచి 65,257 మంది విద్యార్థులకు అమెరికా వీసాలు మంజూరు చేసింది. 2017కు వచ్చే సరికి ఆ సంఖ్య 47,302కు తగ్గిపోయింది. అదే సమయంలో చైనా విద్యార్థులకిచ్చే వీసాలు 24 శాతం తగ్గాయి. ‘‘భారత్‌ విద్యార్థులు చూపే బ్యాంకు స్టేట్‌మెంట్లను అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. అమెరికా వచ్చే వరకు డబ్బులు ఉన్నట్లు చూపి ఆ తర్వాత డ్రా చేసుకుంటున్నారు. దానివల్ల గతంలో మాదిరిగాకాకుండా వీసాలు జారీ చేసేముందు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి’ అని అమెరికాలో విశ్వవిద్యాలయాలపై అధ్యయనం చేసిన అన్నవరపు కుమార్‌ అభిప్రాయబడ్డారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com