ఏడాది పాటు ఉచితం

దేశీయ టెలికాం ఆపరేటర్‌ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఏడాది పాటు 4జీ డేటాను అందించనున్నట్లు వెల్లడించింది. 4జీ హ్యాండ్‌సెట్లు కలిగి ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ వినియోగించని వారు, అదే విధంగా ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తూ కొత్త 4జీ హ్యాండ్‌సెట్లకు అప్‌గ్రేడ్‌ అయిన వారికి ఈ ఆఫర్‌ చెల్లుబాటు అవుతుంది. జనవరి 4, 2017 నుంచి ఫిబ్రవరి 28, 2017 మధ్య ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు ప్రతి నెలా 3జీబీ ఉచిత డేటాను డిసెంబర్‌ 31, 2017 వరకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ప్యాక్‌ల ద్వారా పొందవచ్చని తెలిపింది. ‘4జీ అనుభూతిని ఏడాది పాటు ఆనందించేందుకు వినియోగదారులకు స్వాగతం పలుకుతున్నాం. దేశవ్యాప్తంగా 4జీ హ్యాండ్‌సెట్ల వినియోగం పెరుగుతోంది. ఎక్కువమంది వేగవంతమైన బ్రాండ్‌ సేవలను అందిపుచ్చుకునేందుకు ఎయిర్‌టెల్‌ ఈ ఆకర్షణీయ పథకం అందిస్తోంది’ అని భారతీ ఎయిర్‌టెల్‌ డైరెక్టర్‌ మార్కెటింగ్‌ ఆపరేషన్స్‌ అజయ్‌ పూరి వెల్లడించారు. ఉదాహరణకు 4జీ హ్యాండ్‌ సెట్లు కలిగిన ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.345తో రీఛార్జ్‌ చేసుకుంటే ఈ పథకం కిందకు వస్తారు. రూ.345 రీఛార్జ్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ 4జీబీ(1జీబీ రెగ్యులర్‌ ప్యాక్‌ బెనిఫిట్‌ ప్లస్‌ 3జీబీ ఉచిత డేటా)ను ప్రతినెలా పొందవచ్చు. ఇది 28రోజుల పాటు ఉంటుంది. డిసెంబర్‌ 31 వరకు కేవలం 13 సార్లు మాత్రమే రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు రూ.549 ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌తో పాటు 6జీబీ(3జీబీ రెగ్యులర్‌ డేటా ప్లస్‌ 3జీబీ ఉచిత డేటా) డేటాను పొందవచ్చు. రూ.799 ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌తో పాటు 8జీబీ డేటా(5జీబీ రెగ్యులర్‌ డేటా ప్లస్‌ 3జీబీ ఉచిత డేటా) ను పొందవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com