ఏడో తరగతి కుర్రాడు. టీచరును రేప్ చేస్తానని బెదిరించాడు.

గురుగ్రామ్‌లో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల కుర్రాడు తన స్కూలుకే చెందిన అధ్యాపకురాలిపైన, ఆమె కుమార్తె (మైనర్‌బాలిక)పై అత్యాచారానికి పాల్పడతానంటూ హెచ్చరించాడు. ఆ హెచ్చరిక కూడా సామాజిక మాధ్యమంలో వెనకాముందాలోచించకుండా పెట్టేశాడు. ఫేస్‌బుక్‌లో ఆ బాలుడు పెట్టిన ఈ పోస్టింగ్‌ చూసిన జనం కళ్లుబైర్లు కమ్మాయి. ఆ అధ్యాపకురాలి కుమార్తె స్వయంగా ఈ కుర్రాడి తరగతిలోనే చదువుతుండటం మరింత బాధాకరమైన విషయం. ఈ ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌ దెబ్బకు ఆ బాలిక భయపడిపోయి…తీవ్ర ఆవేదనకు గురై స్కూలు మానేసింది. తల్లి మాత్రం ఎలాగో తనను తాను కూడదీసుకుని విధులకు హాజరౌతున్నారు. మరో ఘటనలో కౌమార్యప్రాయం బాలుడు మరో అధ్యాపకురాలిని సరదాగా తనతో రమ్మని ఆహ్వానించాడు. క్యాండిల్‌లైట్‌ డిన్నర్‌తో పాటూ…ఆమెతో శారీరక కలయికనూ తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆమెకు ఈ-మెయిల్‌నే పంపి సంచలనం సృష్టించాడు. ఈ రెండు ఘటనలు గతవారమే ఈ పాఠశాలలో చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత జిల్లా శిశు సంరక్షణ సంఘం తీవ్రంగా స్పందించింది. పాఠశాల అధికారులతోపాటూ..పిల్లలకు కూడా కౌన్సెలింగ్‌ ఇప్పించే యత్నాల్లో ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com