ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమతి ఇచ్చిన బంద్ ఏపీ జిల్లాలో కొనసాగుతోంది.
సోమవారం తెల్లవారుజాము నుంచే వివిధ పార్టీల నేతలు రోడ్డుపైకి వచ్చి బస్సులను అడ్డుకుంటున్నారు.
దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
టీడీపీ మినహా కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ సమాజ్‌వాదీ పార్టీల నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నాయి.
అలాగే బంద్‌కు సినీ ఎగ్జిబిటర్ల మద్దతు ప్రకటించారు.
విజయవాడ, విశాఖలో ఉదయం సినిమాషోలు రద్దు చేశారు.
*** జిల్లాల్లో బంద్ ప్రభావం:
శ్రీకాకుళం: ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, పాలకొండ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి.
ప.గో: జిల్లాలో బస్సు డిపోల ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో తాడేపల్లిగూడెం, తణుకు డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం డిపోల్లో బస్సులను నిలిపివేశారు.
కడప: జిల్లాలో ప్రత్యేక హోదా కోసం బంద్ కొనసాగుతోంది. కడప ఆర్టీసీ డిపో ఎదుట వైసీపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు.
ప్రకాశం: జిల్లాలో అన్ని బస్సు డిపోల ఎదుట విపక్షాలు ఆందోళనకు దిగాయి. బస్సులు బయటకు రాకుండా విపక్ష నేతలు అడ్డుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుంటూరు: జిల్లా వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కాంగ్రెస్, వైసీపీ, వామపక్షాలు, జనసేన శ్రేణుల ధర్నా చేపట్టారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తల తలకిందులుగా నిరసన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ నేతలు మోడీ కేడీ పేరుతో కబడ్డీ ఆడారు. చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద విపక్షాల ఆందోళనకు దిగాయి.
నెల్లూరు: జిల్లాలో బంద్ కొనసాగుతోంది. కావలి ఆర్టీసీ డిపో ఎదుట వామక్షాల నేతలు ఆందోళన దిగారు.
విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం విశాఖ జిల్లాలో బంద్ జరుగుతోంది. మద్దెలపాలెం ఆర్టీసీ డిపో ఎదుట వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ద్వారకా బస్టాండ్‌లో వైసీపీ నేతలు బస్సులను అడ్డుకున్నారు.
కర్నూలు: హోదా సాధన కోసం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. బస్సు డిపోల ఎదుట వైసీపీ, వామపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు బస్సులు నిలిచిపోయాయి.
విజయనగరం: జిల్లాలో బంద్ కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, శృంగవరపుకోట, విజయనగరంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
తిరుపతి: పూర్ణకుంభం సర్కిల్లో విపక్షాలు ధర్నాకు దిగాయి. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆందోళనకారులు బైక్‌కు నిప్పుపెట్టడంతో ఒకింత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కృష్ణా: జిల్లాలో బంద్ కొనసాగుతోంది. గుడివాడలో వామపక్షాల నిరసనకు దిగారు. బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బస్ సర్వీసులను నిలిపివేశారు.
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా విపక్షాల బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాల బైఠాయించి ఆందోళన చేపట్టారు.
నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా విపక్షాలు బంద్ పాటిస్తున్నాయి. వెంకటగిరి ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి నిరన వ్యక్తం చేస్తున్నాయి.
విజయవాడ: జిల్లాల విపక్షలు చేపట్టిన బంద్ కొనసాగుతోంది. నెహ్రూ బస్టాండ్‌లో వామపక్షాలు ఆందోళనకు దిగారు. సిపిఎం మధు, చలసాని శ్రీనివాస్ ఆందోళనలో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో ప్రధాన కూడళ్లలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 14 డిపోల్లో నిలిచిన 1380 బస్సులు నిలిచిపోయాయి.