ఏపీ దొరలూ…ఇది చదువుకుని సిగ్గు తెచ్చుకోండి

తెలుగు తప్పనిసరిపై తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకురానుంది. ఇంటర్మీడియట్‌ వరకు తెలుగుభాషను తప్పనిసరి చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలు, సిలబస్‌ రూపకల్పన, పాఠ్యపుస్తకాల తయారీకోసం తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్సీ సత్యనారాయణ నేతృత్వంలో ఓ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా అందించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్‌ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముందుగా ఆర్డినెన్సును తీసుకురానుంది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ముసాయిదాను రూపొందించి న్యాయశాఖ పరిశీలనకు పంపించింది. న్యాయశాఖ పరిశీలన అనంతరం గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్సును జారీ చేస్తారు. ఉర్దూ మాతృభాష కలిగిన వారికి మాత్రం తెలుగు స్థానంలో ఉర్దూ భాషలో చదివే వెసులుబాటు కల్పిస్తారు.

More News

One thought on “ఏపీ దొరలూ…ఇది చదువుకుని సిగ్గు తెచ్చుకోండి

  1. maharshi

    ఉమ్మ‌డి రాష్ట్రంలోనే జి.ఓ నం. 420 ఇచ్చారు.
    అదీ ఇంగ్లీషులో
    దాన్ని అమ‌లు చేస్తే చాలు
    అస‌లు ఇంగ్లీసు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే కాదు
    ప్ర‌యివేటు పాఠ‌శాల‌లోనూ ప‌రిమితం చేస్తారా?
    త‌ల్లిదండ్రుల‌లో మార్పు రానంత వ‌ర‌కు
    ప్ర‌భుత్వాలు ఎన్ని ఆదేశాలిచ్చినా ఇలానే
    ప‌రిస్ధితి ఉంటుంది
    ఎవ‌ర్ని చూసి
    ఎవ‌రూ నేర్చుకునేందుకే ఉండ‌దిక్క‌డ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com